Yatra 2: యాత్ర 2 సినిమా వల్ల పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరుగుతుందా..? కారణం ఏంటంటే..?

నిజానికి ఈ సినిమాని ఇంతకుముందే రిలీజ్ చేయాల్సింది కానీ ఎలక్షన్స్ వస్తున్నాయనే నేపథ్యంలో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అయితే మొదటి పార్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి చాలా హెల్ప్ అయింది.

Written By: Gopi, Updated On : February 8, 2024 10:13 am

Yatra 2

Follow us on

Yatra 2: మహి వి రాఘవ డైరెక్షన్ లో ఆంధ్రప్రదేశ్ సీఎం అయిన జగన్ మోహన్ రెడ్డి వాళ్ల నాన్న రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చేపట్టిన ఓదార్పు యాత్రను బేస్ చేసుకొనే ఈ యాత్ర 2 సినిమాని తెరకెక్కించారు. మొదట యాత్ర సినిమా సూపర్ సక్సెస్ అవడంతో, ఆ సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమాని దింపుతున్నారనే వార్తలు మొదటి నుంచి వస్తున్నాయి.

నిజానికి ఈ సినిమాని ఇంతకుముందే రిలీజ్ చేయాల్సింది కానీ ఎలక్షన్స్ వస్తున్నాయనే నేపథ్యంలో ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు రిలీజ్ చేస్తున్నారు. అయితే మొదటి పార్ట్ జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి చాలా హెల్ప్ అయింది. ఇక తన సీఎం పదవిని కాపాడుకోవడానికి ఈ యాత్ర 2 సినిమా హెల్ప్ అవుతుందని ఆయన భావిస్తున్నారు.ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా ఇవాళ్ల రిలీజ్ అయింది. అయితే చాలామంది ఈ సినిమా పవన్ కళ్యాణ్ కి మైనస్ అవుతుందని అనుకుంటున్నారు.

కానీ ఇప్పుడు ఈ సినిమా వల్ల పవన్ కళ్యాణ్ కే ఎక్కువ ప్లస్ అవుతుందని మరి కొందరు చెప్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాని జగన్మోహన్ రెడ్డి దగ్గరుండి తీయించిన విషయం జనాలకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన సీఎం అవ్వకముందు ఉన్న పరిస్థితులను చూపించారు. జనాలు ఆయన్ని నమ్మి సీఎం చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు అనేది క్లారిటీ గా అయితే చూపించలేదు. నిజానికి జగన్ సింపతితోనే సీఎం అయ్యాడు. అయితే ఆయన సిఎం అయిన తర్వాత గత ప్రభుత్వాన్ని కాదని ఈయన ఏం చేశాడు అనేది చెప్పుకోడానికి కూడా సినిమాలో ఒక అంశాన్ని కూడా సరిగ్గా చూపించలేదు.

దానివల్ల పవన్ కళ్యాణ్ ఇంతకుముందు చాలా సభల్లో చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడానికి చాలా ప్రయత్నాలు చేశాడు. సరే సీఎం అయితే అయ్యాడు కానీ ఆయన పదవిలోకి వచ్చాక జనాలకి ఏం చేస్తున్నాడు. అనే పాయింట్ ను మాట్లాడాడు. అయితే దానికి జస్టిఫికేషన్ ఇచ్చే విధంగా ఈ సినిమాలో జగన్ చేసిన పనులను ఎక్కువగా చూపించి ఉంటే బాగుండేది. అయిన జగన్ ఎవరికి ఏమీ చేశాడని చూపిస్తారు అంటు జనాలు ఆయన పాలన మీద సటైర్లు వేస్తున్నారు. మరి ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు నిజమయ్యాయి అని జనాలు భావించే అవకాశాలు కూడా ఉన్నాయంటూ చాలా మంది జనాలు వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.