Wine Rates :ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఉన్న లిక్విడ్ మద్యం. రోజంతా ఒత్తిడితో కూడుకొని ఉన్నవారు కాస్త మద్యం సేవిస్తే మనసు ప్రశాంతంగా ఉంటుందని చాలా మంది భావన. దీంతో కొందరు ప్రతిరోజూ రెండు పెగ్గులు వేసి నిద్రపోతారు. మరికొందరు వీకెండేస్ లో ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆరోగ్యంపై మద్యం ప్రభావం గురించి చాలా కథనాలు వస్తున్నాయి. ఏదీ ఏమైనా తక్కువ మోతాదులో తీసుకుంటే పెద్ద ప్రమాదమేమి కాదని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. అయితే కొందరు మత్తు కోసం అతిగా మద్యం సేవించి అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో మద్యానికి రోజురోజుకు డిమాండ్ పెరగడమే కానీ తగ్గడం లేదు.
మద్యంకు ధరలు పెరుగుతున్నా.. డిమాండ్ తగ్గడం లేదు. ధర ఎంత ఉన్నా కొనుగోలు చేయడానికి కొందరు మద్యం ప్రియులు వెనుకాడడం లేదు. దీంతో మద్యం వ్యాపారం జోరుగా సాగుతోంది. మద్యం తయారీ ప్రదేశం నుంచి అమ్మకానికి వచ్చే ప్రదేశానికి ధర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మద్యంపై ఆయా రాష్ట్రాలు విధించే పన్నుతో ఇవి మరింత ఎక్కువ అవుతాయి. దీంతో కొన్ని చోట్ల మధ్యం ధరలు ఎక్కువగా..మరికొన్ని చోట్ల తక్కువగా ఉంటాయి. అంతేకాకుండా పెట్రోల్, మద్యం ధరలపై జీఎస్టీ ఉండదు. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాలను భట్టి మద్యం ధరలు ఉంటున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో మద్యం ధరలు తక్కువగా ఉంటాయి. ఆ రాష్ట్రాలు ఏవంటే?
మొన్నటి వరకు పుదుచ్చేరిలో మద్యం ధరలు తక్కువగా ఉండేవి. దీంతో చుట్టుపక్కల రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి మద్యం కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు. కానీ ఇప్పుడు గోవాలో కూడా మద్యం ధరలు తక్కువగా ఉన్నాయి. ఇక్కడ మద్యం బాటిళ్లపై ప్రభుత్వం పన్ను తక్కువగా ఉంది. ఇక్కడ మద్యంపై 22 శాతం మాత్రమే పన్ను విధిస్తారు. దీంతో బీర్ బాటిల్ కేవలం రూ.60 లభిస్తుంది. ఇదే బీర్ తెలంగాణలో రూ.160 వరకు విక్రయిస్తుంటారు. కాగా తెలంగాణలో మద్యంపై సుంకంను 70 శాతం విధిస్తారు.
ఉత్తరాదిన పరిశీలిస్తే ఢిల్లీ, ముంబై మద్యం ధరల్లో చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఢిల్లీలో రూ.3,100 లభించే బాటిల్ ముంబైలో రూ.4000తో విక్రయిస్తున్నారు.ఆయా ప్రాంతాల్లోని డిమాండ్ ను భట్టి ప్రభుత్వాలు మద్యం ధరలు పెంచుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో మద్యంకు డిమాండ్ ఎక్కువే. అయితే ఇటీవల మద్యం ధరలను తగ్గించారు.