Homeఆంధ్రప్రదేశ్‌YSRCP political strategy: ఆ మూడు సీట్లపై ఆశలు వదులుకున్న వైసిపి!

YSRCP political strategy: ఆ మూడు సీట్లపై ఆశలు వదులుకున్న వైసిపి!

YSRCP political strategy: వైఎస్ఆర్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీ గుణపాఠాలు నేర్చుకోలేదు. కొన్ని నియోజకవర్గాల్లో అసలు నాయకత్వాలు లేవు. ముఖ్యంగా పార్లమెంటరీ నియోజకవర్గాల బాధ్యులు లేకపోవడం ఆ పార్టీకి నిజంగా లోటు. వైసిపి అద్భుత విజయం సాధించవచ్చు కానీ కొన్ని పార్లమెంటు నియోజకవర్గం ఆ పార్టీకి చిక్కలేదు. మూడుసార్లు పోటీ చేస్తే.. ఒక్కసారి కూడా గెలవని నియోజకవర్గాలు మూడు ఉన్నాయి. శ్రీకాకుళం, విజయవాడ, గుంటూరు పార్లమెంటు స్థానాలు ఇప్పటికీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కష్టమే అన్నట్టు మారుతున్నాయి. ఎందుకంటే ఇక్కడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జిలుగా ఉండేందుకు ఎవరు ఇష్టపడడం లేదు. ఎన్నికల సమయంలో పోటీ చేయమంటే ముందుకు రావడం లేదు. అంతలా బలంగా ఉంది అక్కడ టిడిపి కూటమి. తెలుగుదేశం పార్టీ సింగిల్ గా ఉన్నప్పుడే ఆ నియోజకవర్గాల్లో బలంగా ఉంది. ఆపై జనసేనతో పాటు బిజెపి తోడు కావడంతో తిరుగులేని శక్తిగా మారింది. అందుకే అక్కడ పోటీ చేసేందుకు నేతలు ముందుకు రాని పరిస్థితి.

శ్రీకాకుళంలో చేదు ఫలితం..
శ్రీకాకుళం( Srikakulam) పార్లమెంట్ స్థానంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు చేదు ఫలితాలే. 2014 నుంచి 2024 వరకు గెలిచారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. ఆయనపై మూడుసార్లు ప్రయోగం చేశారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ స్థానాన్ని మాత్రం నిలబెట్టుకోలేక పోయారు. తొలి ఎన్నికల్లో రెడ్డి శాంతి పోటీ చేశారు. రెండో ఛాన్స్ లో దువ్వాడ శ్రీనివాస్ బరిలో దించారు. మొన్న పేరాడ తిలక్ పోటీ చేసిన ఓటమి ఎదురయింది.. వచ్చే ఎన్నికల్లో సీనియర్ నేతలైన ధర్మాన, తమ్మినేని కుటుంబాల నుంచి ఎవరినో ఒకరిని పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు. కానీ వారు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ టిడిపికి సంస్థాగతంగా బలం ఎక్కువ.

విజయవాడలో వికటించిన ప్రయోగం..
మరోవైపు విజయవాడ( Vijayawada) పార్లమెంటు స్థానంలో సైతం తెలుగుదేశం పార్టీ అప్రతిహస విజయం కొనసాగుతోంది. 2009 వరకు అక్కడ కాంగ్రెస్ పార్టీ హవా చాటింది. రెండుసార్లు ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన లగడపాటి రాజగోపాల్ గెలిచారు. 2014 లో తొలిసారిగా టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని నాని గెలిచారు. ఆయనపై ప్రముఖ పారిశ్రామికవేత్త కోనేరు రాజేంద్రప్రసాద్ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రెండోసారి టిడిపి అభ్యర్థిగా కేసినేని నాని పోటీ చేశారు. ఈసారి మరో పారిశ్రామికవేత్త పోట్లూరు వరప్రసాద్ను రంగంలోకి దించారు జగన్మోహన్ రెడ్డి. అయినా సరే ఓటమి ఎదురైంది. మూడోసారి మొన్ననే సిట్టింగ్ ఎంపీ కేసినేని నానిని వైసీపీలోకి రప్పించి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయించారు. కానీ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన కేసినేని నాని సోదరుడు చిన్ని గెలిచారు ఆయన పైనే. ఇప్పుడు విజయవాడ ఎంపీ స్థానం అంటేనే వైసిపి సభ్యులు ఎవరు ముందుకు రాని పరిస్థితి. అసలు ఉన్నారా లేరా అన్నట్టు ఉంది అక్కడ పరిస్థితి. చివరకు బిసి సామాజిక వర్గ నేతను బరిలోకి దించాలని చూస్తున్నారట జగన్మోహన్ రెడ్డి.

గుంటూరులో స్ట్రాంగ్ లీడర్..
గుంటూరు ( Gunturu ) గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అక్కడ టిడిపికి స్ట్రాంగ్ లీడర్ దొరికారు పెమ్మసాని చంద్రశేఖర్ రూపంలో. 2014లో ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా గల్లా జయదేవ్ గెలిచారు. రెండోసారి 2019లో విజయం కూడా ఆయనదే. ఈ రెండుసార్లు కొత్త కొత్త ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే 2019లో వైసీపీ గెలవడంతో.. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన జయదేవ్ ఇబ్బంది పడ్డారు. దీంతో 2024 ఎన్నికల కు ముందు క్రియాశీలక రాజకీయాలకు దూరమయ్యారు. అయితే అలా ఆయన దూరమైన క్రమంలో అంతే బలమైన నేత అయిన పెమ్మసాని చంద్రశేఖర్ టిడిపి అభ్యర్థిగా దొరికారు. ఆ ఎన్నికల్లో గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అయితే ఆయన పై వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిలారి రోశయ్య పక్కకు వెళ్లిపోయారు. పార్టీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరిపోయారు. ఇక్కడ వైసిపి పార్లమెంటరీ ఇన్చార్జిగా పోతిన మహేష్ ను నియమిస్తే అయ్యో నేను వెళ్ళను అంటూ ఆయన మొండి చేస్తున్నారు. ఇలా ఈ మూడు పార్లమెంటరీ నియోజకవర్గాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతకు చుక్కలు చూపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version