https://oktelugu.com/

Kanuma: అసలు పండుగ ఈరోజే.. కనుమ నాడు మాంసం తినాల్సిందే.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..

సంక్రాంతి మూడు రోజుల పండుగ. తొలిరోజు భోగి.. మరుసటి రోజు సంక్రాంతి.. మూడోరోజు కనుమ.. నాలుగో రోజు ముక్కనుమ. సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా జరుగుతుంది. తెలంగాణలో దసరా అయితే ఏ స్థాయిలో జరుగుతుందో.. సంక్రాంతి ఆంధ్రప్రదేశ్లో ఆ స్థాయిలో జరుగుతుంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : January 15, 2025 / 10:16 AM IST

    Kanuma

    Follow us on

    Kanuma: కోడిపందాలు.. పిండి వంటలు.. కొత్త అల్లుళ్లకు విందులు.. సారెలు.. రంగవల్లులు..ఇన్ని రకాల సంప్రదాయాలు ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తాయి. అందువల్లే ఆ పండుగను అక్కడి ప్రజలు ఘనంగా జరుపుకుంటారు. ఇక కొన్ని ప్రాంతాలలో జాతరలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పోటాపోటీగా ప్రభల బండ్లు ఊరేగుతాయి. రాజకీయ పార్టీల నాయకులు తమ స్థాయిని ప్రదర్శించుకునేందుకు ప్రభల బండ్లను ఉపయోగించుకుంటారు. ఇక జాతరల సమయంలో పడవల పోటీలు, పతంగులను ఎగరవేసే పోటీలను, కోడిపందాలను నిర్వహిస్తారు. భీమవరం, తణుకు, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం, తాడేపల్లిగూడెం, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, తిరువూరు, జగ్గయ్యపేట ప్రాంతాలలో కోడిపందాలను విస్తారంగా నిర్వహిస్తుంటారు. ఈసారి ప్రభుత్వం కూడా అనుమతి ఇవ్వడంతో కోడిపందాలు బీభత్సంగా జరుగుతున్నాయి. కోట్లకు కోట్లు చేతులు మారుతున్నాయి.

    నేడు మాంసాహారం తో విందులు

    భోగి నాడు భోగిపళ్లను పిల్లలపై పోస్తారు. హరిదాసు కు బియ్యం, వస్త్రాలు, నగదు దానం ఇస్తారు. ఇక సంక్రాంతి నాడు శాఖాహార వంటకాలు వండి కుటుంబం మొత్తం తింటారు. సకినాలు, అరిసెలు, లడ్డూలు, బూరెలు, చలివిడి వంటి వంటకాలు తయారుచేసి పెద్దలకు పెడతారు. ఆ తర్వాత మిగతా కుటుంబ సభ్యులు భుజిస్తారు. కనుమనాడు మాంసాహార వంటకాలు వండుతారు. చికెన్, మటన్ తినడానికి ఆసక్తి చూపిస్తుంటారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి నాడే చాలామంది మాంసాహారం తిన్నారు. ఇక కనుమనాడు చికెన్, మటన్ ఇష్టంగా తింటారు. ఆంధ్రప్రదేశ్లో కనుమనాడు భారీగా మాంసం విక్రయాలు జరుగుతున్నాయి. చికెన్ స్కిన్లెస్ ఏపీలో కిలో ధర 230 వరకు పలుకుతోంది. మటన్ ధర 850 వరకు ఉంది.. కొందరైతే పొట్టేళ్లను ప్రత్యేకంగా కోసుకొని వాటాలు వేసుకుంటున్నారు. ఒక్కో వాటా ధర 650 వరకు పలుకుతోంది.. ఇక తెలంగాణలో సంక్రాంతి నాడే చాలామంది ముక్కలు లాగించారు. కనుమ రోజు మాంసాహారం తిన్న తర్వాత పశువులను పూజిస్తారు. శుభ్రంగా వాటిని కడిగి.. కొమ్ములకు రంగులు వేసి.. మెడలో బంతిపూల మాలవేసి.. సంక్రుడు అనే దేవుడిని బంకమట్టితో తయారుచేసి.. గడ్డితో తాళ్ళను పేని.. సోరకాయలు, వంకాయలు వంటి వాటిని కట్టి.. దాని కిందుగా పశువులను పంపిస్తారు. ఆ సమయంలో బెల్లంతో అన్నం వండి.. దానిని పశువుల మీద చల్లుతారు.. ప్రభల బండ్లను ఎడ్లతో లాగిస్తారు. ఇక కొన్నిచోట్ల అయితే ఎడ్లకు బండలాగుడు పోటీలు నిర్వహిస్తారు. ఇందులో గెలిచిన ఎడ్లకు భారీగా బహుమతులు ఇస్తారు. ఈసారి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడంతో.. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు పలు రకాల పోటీలను నిర్వహిస్తున్నారు.