Highest Scores in the T20s : టీ20 అంటేనే వేగానికి కొలమానం. తక్కువ ఓవర్ల మ్యాచ్ కాబట్టి బ్యాట్స్ మెన్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోతారు. రెప్ప మూసి తెరిచే లోపు బాల్ బౌండరీ దాటుతుంది. క్షణాల వ్యవధిలో బాల్ స్టాండ్స్ లో పడుతుంది. అలాంటి బ్యాట్స్ మెన్స్ కు బౌలింగ్ చేయాలి అంటే ఎంతటి తోపు బౌలర్ కైనా ఇబ్బందే. ఇక టీ 20 ల్లో రెచ్చిపోయి బ్యాటింగ్ చేసే వారు ఎందరో ఉన్నారు. అందులో భారత బ్యాట్స్ మెన్ కూడా ఉన్నారు. ఇందులో మొదటి సెంచరీ సురేష్ రైనా చేశాడు. అత్యధిక సెంచరీలు చేసిన ఘనత రోహిత్ కుమార్ పేరిట ఉంది.

సూర్య కుమార్ యాదవ్
కివీస్ టూర్ లో భాగంగా టీం ఇండియా సూపర్ బ్యాట్స్ మెన్, మిస్టర్ 360 సూర్య కుమార్ యాదవ్ రెండో టీ ట్వంటీ మ్యాచ్ లో సెంచరీ(111*) చేశాడు. సూర్యకి ఇది రెండో సెంచరీ. జూలై 2022 లో అతడు ఇంగ్లాండ్ జట్టు పై సెంచరీ(117 పరుగులు) చేశాడు. టీ ట్వంటీల్లో సూర్యకు ఇదే అత్యధిక స్కోర్. కానీ ఆ మ్యాచ్ లో ఇండియా ఓడిపోయింది.
విరాట్ కోహ్లీ
కింగ్ కోహ్లీ (122*) స్కోరు తో ఈ జాబితాలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. 2022 ఆసియా కప్ సూపర్ _4 లో ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో కింగ్ ఈ స్కోరు సాధించాడు. టీ20ల్లో విరాట్ కు ఇదే తొలి శతకం.
రోహిత్ శర్మ
భారత హిట్ మ్యాన్ టీ ట్వంటీ ల్లో మూడు సెంచరీలు సాధించాడు. అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2015 లో సౌత్ ఆఫ్రికా తో జరిగిన మ్యాచ్ లో 66 బంతుల్లో 106 పరుగులు చేశాడు.
2017 డిసెంబర్ శ్రీలంక తో జరిగిన మ్యాచ్ లో 43 బంతుల్లో 118 పరుగులు చేశాడు. 2018లో వెస్టిండిస్ తో జరిగిన మ్యాచ్ లో 111పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. జూలై 2018లో జరిగిన మ్యాచ్ లో 56 బంతుల్లో సెంచరీ సాధించాడు.
కేఎల్ రాహుల్
విండీస్ తో 2016లో జరిగిన మ్యాచ్ లో కేఎల్ రాహుల్ 51బంతుల్లో 110 పరుగులు చేసి నాట్ ఔట్ గా నిలిచాడు. 2018లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 101 పరుగులు చేశాడు.
సురేష్ రైనా
భారత్ తరపున తొలి టీ 20 లో సెంచరీ సాధించిన ఆటగాడు సురేష్ రైనా. ఇంగ్లాండ్ తో 2010లో జరిగిన మ్యాచ్ లో 60 బంతుల్లో 101 పరుగులు చేశాడు.
దీపక్ హుడా
దీపక్ హుడా 2022లో ఐర్లాండ్ తో జూన్ లో జరిగిన మ్యాచ్ లో 57 బంతుల్లో 104 పరుగులు చేశాడు.