Chiranjeevi Pawan Kalyan చిరంజీవికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం దక్కడం పై పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. ఆయన ఖ్యాతిని వేయి నోళ్ళ పొగిడారు. ఈ సందర్భంగా అన్నయ్య పై తన ప్రేమను చాటుకుంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. అది మెగా అభిమానులకు ఎంతో ఆనందాన్ని పెంచింది. వైరల్ గా మారింది.
పవన్ కళ్యాణ్ ప్రకటనలో చిరంజీవి ప్రతిభకు దక్కిన అరుదైన గౌరవం గా కొనియాడారు “తెలుగు చలన చిత్రసీమలో శిఖర సమానులు, అన్నయ్య శ్రీ చిరంజీవి గారిని ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్-2022’ పురస్కారం వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించింది. గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో భాగంగా భారత ప్రభుత్వం ప్రకటించిన ఈ పురస్కారం అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం. ఈ ఆనంద సమయంలో నా మార్గదర్శి అన్నయ్య చిరంజీవి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను. నాలుగు దశాబ్దాలుపైబడిన అన్నయ్య సినీ ప్రస్థానం, తనను తాను మలచుకొని ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థానం సంపాదించుకోవడం నాతో సహా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అంతర్జాతీయ చలన చిత్ర వేదికపై అన్నయ్య చిరంజీవి గారికి ఈ గౌరవం దక్కుతున్నందుకు ఎంతో ఆనందిస్తున్నాను.” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
*మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డ్*
P
మెగాస్టార్ చిరంజీవి.. టాలీవుడ్ లో నంబర్ 1 స్థానానికి ఎదిగిన హీరో. ఎందరికో స్ఫూర్తిని పంచిన హీరో.. తన కెరీర్ మొదటి నుంచి ఇప్పటిదాకా స్వయంకృషితో ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన చేసిన ఎన్నో కళాత్మక చిత్రాలకు అవార్డులు సొంతమయ్యాయి. చిరంజీవిని వరించని అవార్డ్ లేదు. ఇప్పుడు తాజాగా ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది. చిరంజీవికి అరుదైన గౌరవం లభించింది.
టాలీవుడ్ మెగాస్టర్ చిరంజీవి కీర్తికిరీటంలో మరో ప్రతిష్టాత్మక అవార్డ్ చేరింది. చిరంజీవిని ‘ఇండియన్ ఫిల్మ్ ప కుర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ -2022’ అవార్డ్ వరించింది.
53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫీ) చలనచిత్రోత్సవం నేడు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది.
చిరంజీవి తన 40 ఏళ్ల సినీ ప్రస్థానంలో 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయనకు ఈ అవార్డ్ ఇవ్వడంపై కేంద్ర ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో హర్షం వ్యక్తం చేసింది. గోవా వేదికగా ఇఫీ చలనచిత్రోత్సవం నేటి నుంచి ఈనెల 25 వరకూ జరగనుంది.
https://twitter.com/PIB_India/status/1594322388396933120?s=20&t=Lz-bzekHNUCRjqrKjJCEjg