ఐపీఎల్ ఫస్ట్ మ్యాచ్.. అందరూ ముంబైని ఫేవరేట్ అనుకున్నారు. రైనా, భజ్జీ దూరం కావడం.. కరోనాతో ఆటగాళ్లు వైదొలగడంతో చెన్నైపై అంచనాలు లేవు. కానీ వచ్చాడు మన తెలుగోడు. ముంబైతో జరిగిన మ్యాచ్ లో చెన్నై తరుఫున 4వ స్థానంలో బరిలోకి దిగిన రాయుడు 48 బంతుల్లో 71 పరుగులు చేసి అదరగొట్టాడు. చెన్నైని గెలిపించాడు. అయితే ఆ మ్యాచ్ లో రాయుడు గాయపడడంతో చెన్నై లయ తప్పింది.
Also Read: ‘మహేంద్రుడి’పై విమర్శల వెల్లువ..!
వరుసగా రెండు మ్యాచుల్లో చెన్నై ఓడిపోయింది. రాయుడు లేకనే తాము ఓడిపోయామని తాజాగా ఢిల్లీతో పోరులో ఓడిపోయాక చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని తెలిపాడు. ‘అంబటి రాయుడు లేకపోవడంతోనే చివరి రెండు మ్యాచుల్లో ఓడిపోయాం. బ్యాటింగ్ ఆర్డర్లో సమతూకం రావడం లేదు. బ్యాటింగ్ విభాగంలో కసి లేదు. దూకుడైన ఆరంభం లేకపోవడంతో ఒత్తిడి పెరిగి ఓడిపోయాం. రాయుడు వస్తే జట్టు సమతూకం మెరుగవ్వచ్చు’ అంటూ ఎంఎస్ ధోని తాజాగా మన రాయుడు గురించి గొప్పగా చెప్పాడు.
ఇండియన్ టీంలోకి సెలెక్ట్ చేయకున్నా.. ప్రపంచకప్ కు దూరం పెట్టినా మన అంబటి రాయుడు స్టామినా ఇప్పటికీ తెలుసొచ్చింది. ఐపీఎల్ తొలి మ్యాచ్ లో తన బ్యాటింగ్ తో ముంబైని ఓడించిన రాయుడు అవసరాన్ని ఇప్పటికైనా బీసీసీఐ గుర్తిస్తే మన క్రికెట్ బాగుపడుతుంది.
Also Read: రికార్డుకు బ్రేక్..కోల్‌కతాకు కోలుకోలేని దెబ్బ
రాయుడు గాయం కారణంగా దూరం అవ్వడంతోనే ఐపీఎల్ లో చైన్నై తేలిపోతోంది. అతడు లేకపోవడంతో జట్టు సమతూకం దెబ్బతింది. తర్వా త మ్యాచ్ కు రాయుడు అందుబాటులోకి వస్తే సర్దుకుంటుందని ధోని భావిస్తున్నాడు. మరి వస్తాడా రాడా అన్నది చూడాలి.