https://oktelugu.com/

చిరంజీవితోపాటు అందరికీ షాకిచ్చిన  రాంచరణ్‌..!

మెగాస్టార్‌‌ వారసత్వంతో.. బాబాయి పవర్‌‌ స్టార్‌‌ మేనరిజంతో.. సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టారు మెగా పవర్‌‌ స్టార్‌‌ రామ్‌ చరణ్‌. చిరుతతో టాలీవుడ్‌కు పరిచయమైనా.. రెండో సినిమా మగధీరతో ఏకంగా ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ మధ్య భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో చిరంజీవి కోసం లైఫ్ రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు చరణ్. Also Read: ఎస్పీ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 26, 2020 / 10:33 AM IST
    Follow us on


    మెగాస్టార్‌‌ వారసత్వంతో.. బాబాయి పవర్‌‌ స్టార్‌‌ మేనరిజంతో.. సినీ ఇండస్ర్టీలోకి అడుగుపెట్టారు మెగా పవర్‌‌ స్టార్‌‌ రామ్‌ చరణ్‌. చిరుతతో టాలీవుడ్‌కు పరిచయమైనా.. రెండో సినిమా మగధీరతో ఏకంగా ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్నాడు. అప్పటి నుంచి జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈ మధ్య భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ మీద ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో చిరంజీవి కోసం లైఫ్ రిస్క్ చేయడానికి సిద్ధమయ్యాడు చరణ్.

    Also Read: ఎస్పీ బాలు తిట్టడం వల్లే మెగాస్టార్ ఇలా మారాడా?

    రామ్‌చరణ్‌ వెంటవెంటనే సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ హిట్స్‌ సాధిస్తూ తనకంటూ ఇమేజ్‌ సాధించారు. ‘రంగస్థలం’తో ఇండస్ట్రీ హిట్‌ను అందుకున్న చరణ్.. ఆ వెంటనే ‘వినయ విధేయ రామ’ సినిమా చేశాడు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. అంతేకాదు.. ఈ మూవీలో కొన్ని సీన్లపై విమర్శలు కూడా వచ్చాయి. దీంతో తన ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

    ఇప్పటికే రాజమౌళి డైరెక్షన్‌లో మగధీర సినిమా చేసి ఇండస్ర్టీ హిట్‌ అందుకున్న చరణ్‌.. ఇప్పుడు తెలుగు చలన చిత్ర చరిత్రలోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న RRR మూవీలో నటిస్తున్నాడు. ఇందులో రామ్‌చరణ్‌తోపాటు మరో హీరో యంగ్‌ టైగర్‌‌ ఎన్టీఆర్‌‌ కూడా నటిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చెర్రీ అల్లూరిగాను, తారక్‌ కొమరం భీంగానూ కనిపించనున్నారు.

    అయితే.. రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ విడుదలై దాదాపు 20 నెలలు కావస్తోంది. అయినా.. ఇప్పటివరకు చరణ్‌ నుంచి సినిమాలేమీ రాలేదు. ప్రస్తుతం షూటింగ్‌ చేస్తున్న RRR మూవీ ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరికీ తెలియదు. దీంతో తమ అభిమాన హీరో సినిమా లేక ఫ్యాన్స్ నిరాశలో ఉండిపోయారు. RRRతో పాటు మరేదైనా కొత్త సినిమా చేస్తే బాగుండేదని అభిప్రాయడుతున్నారు.

    Also Read: ప్రముఖ నటికి పక్షవాతం.. ఆర్థికసాయం కోసం ఎదురుచూపులు?

    కొరటాల శివ దర్శకత్వంలో నిర్మిస్తున్న ‘ఆచార్య’ సినిమానే ప్రస్తుతం మెగా అభిమానులకు ఊరటనిచ్చే అంశంలా చెప్పొచ్చు. ఈ సినిమాలో తండ్రితో పాటే చరణ్‌ కూడా కీలక పాత్రలో చేస్తున్నాడట. 30 నిమిషాల పాటు ఈ పాత్రలో చరణ్‌ నక్సలైట్‌గా కనిపించనున్నట్లు సమాచారం. ‘ఆచార్య’లో చరణ్ పోషించే పాత్ర గురించి తాజాగా ఈ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో చరణ్‌ కొంచెం లావుగా కనిపించబోతున్నాడట. అందుకోసం ఏ హీరో చేయని విధంగా ఫ్యాట్‌గా తయారవబోతున్నాడని ఇండస్ట్రీ టాక్‌.