T20 Rankings: మిడిల్ ఆర్డర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది. స్పిన్ బౌలింగ్ కూడా అదే స్థాయిలో వేస్తుంది. బంతిని బలంగా ఎలాగైతే కొట్టగలదో.. అదే స్థాయిలో మెలికలు తిప్పుతుంది. పరుగులు సాధించినంత వేగంగానే, వికెట్లు కూడా తీయగలుగుతుంది. అందువల్లే ఆమెను భారత మహిళా క్రికెట్ జట్టుకు మూల స్తంభాలాగా అభివర్ణిస్తుంటారు.. ఇటీవల టీమిండియా వన్డే వరల్డ్ కప్ సాధించడంలో ఆమె ముఖ్యపాత్ర పోషించింది. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరో కాదు.. దీప్తి శర్మ.. అనేక కష్టాలు పడి.. ఈ స్థాయి దాకా వచ్చిన దీప్తి ఇప్పుడు ఏకంగా ఐసిసి టి20 ర్యాంకింగ్స్ ను షేక్ చేసింది…
భారత మహిళా జట్టులో ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకుంది దీప్తి శర్మ.. ప్రస్తుతం ఉమెన్స్ టి20 జట్టులో ఆల్ రౌండ్ ల కేటగిరీ ర్యాంకింగ్స్ లో తొలిసారిగా నెంబర్ వన్ ర్యాంకు దక్కించుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్లో ఒక స్థానాన్ని మెరుగుపరుచుకుని దీప్తి.. నెంబర్ వన్ స్థానంలోకి వచ్చింది. దీప్తి (737) పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. శ్రీలతలతో జరిగిన తొలి టీ 20 మ్యాచ్లో దీప్తి ఒక వికెట్ తీయడం ద్వారా తన ర్యాంకును మెరుగుపరుచుకుంది. దీప్తి ఒక వికెట్ తీయడం ద్వారా ఇప్పటివరకు నెంబర్ వన్ స్థానంలో ఉన్న అనాబెల్ సదర్ ల్యాండ్ (736) రెండవ స్థానానికి పడిపోయింది.. టీం ఇండియా పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి ఐదు స్థానాలను మెరుగుపరుచుకుంది. 546 పాయింట్లతో 36వ స్థానంలో నిలిచింది. శ్రీ చరణి 422 పాయింట్లతో 19 స్థానాలు ఏగబాకి, 69వ ర్యాంకు అందుకుంది. బ్యాటింగ్లో జమీమా 653 పాయింట్లతో 14వ స్థానం నుంచి తొమ్మిదవ స్థానానికి చేరుకుంది. వైస్ కెప్టెన్ స్మృతి మందాన 766 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
ప్రస్తుతం హర్మన్ ప్రీత్ కౌర్ ఆధ్వర్యంలో ని టీమిండియా శ్రీలంక జట్టుతో జరుగుతున్న 5 t20 మ్యాచ్ల సిరీస్ లో అదరగొడుతోంది. ఇప్పటికే టీమ్ ఇండియా రెండు మ్యాచ్ లలో విజయాలు సాధించింది. తద్వారా శ్రీలంక జట్టు మీద అప్పర్ హ్యాండ్ కొనసాగిస్తోంది. మూడో మ్యాచ్లో కూడా ఇదే జోరు కొనసాగించి.. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది.