Winter Health Tips: ప్రస్తుతం దేశవ్యాప్తంగా చలి చంపేస్తుంది. ఆసిఫాబాద్, లంబసింగి వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో ఇళ్లలో నుంచి బయటకు రావాలంటే చాలామంది భయపడిపోతున్నారు. ఈ తరుణంలో పిల్లలు, వృద్ధులు ప్రత్యేక ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే చలికాలం అయినందువలన ఎక్కువగా చెమట రాకుండా ఉంటుంది. దీంతో శరీరంలో నుంచి నీరు బయటకు వెళ్ళదు. ఫలితంగా దాహం వేయదు. దాహం వేయని కారణంగా ఎక్కువగా నీరు తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ అవసరం ఉన్నా లేకున్నా శరీరానికి కావాల్సిన నీటిని తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. వేసవికాలంలో దాహం తీర్చుకోవడానికి నీటిని తీసుకుంటే.. చలికాలంలో ఆరోగ్య రక్షణ కోసం కచ్చితంగా ప్రతిరోజు రెండు నుంచి మూడు లీడర్ల వరకు నీటిని తీసుకోవాలని అంటున్నారు. ఇలా తీసుకోకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయంటే?
శరీరంలోని ఆహారాన్ని జీర్ణం చేయడానికి.. ఆ తర్వాత మలినం అయినా నీటిని బయటకు పంపడానికి నీరు ఎంతో ఉపయోగపడుతుంది. కానీ దాహం వేయని కారణంగా నీరు తాగకపోతే శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీంతో రక్తం చిక్కగా మారిపోతుంది. ఇలా రక్తం చిక్కగా ఉండటం వల్ల గుండెపై ప్రభావం పడుతుంది. ఫలితంగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది. శరీరంలో తగినంత నీరు లేకపోవడంతో కిడ్నీలో ఉండే మరణాలను క్లీన్ చేయలేవు. దీంతో ఇందులో స్టోన్స్ రిస్కు ఎక్కువగా అవుతుంది. ఆ తర్వాత వీటిపై నిర్లక్ష్యం చేస్తే కిడ్నీలు పాడయే అవకాశం కూడా ఉంటుంది.
చలికాలంలో స్కిన్ పొడి పారిపోతుంది. ఇలాంటి సమయంలో నీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల చర్మం నిగనిగా లాడుతుంది. నీరు లేకపోవడం వల్ల అలాగే ఉండిపోయి చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య మలబద్ధకం. ఇది చలికాలంలో మరింత ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అనుకోకుండానే చాలామంది నీటిని ఎక్కువగా తీసుకోరు. కానీ ఆహారం తీసుకుంటారు. దీంతో తిన్న ఆహారం జీర్ణ కాకుండా అలాగే ఉండిపోతుంది. దీంతో మలబద్ధకం సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఏ కాలంలోనైనా శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల డిహైడ్రేషన్కు గురై అవకాశముంది. అందువల్ల చలి అని చూడకుండా.. అవసరం లేకున్నా ప్రతిరోజు కచ్చితంగా రెండు నుంచి మూడు లీటర్ల వరకు నీటిని తీసుకోవాలని వైద్యులు తెలుపుతున్నారు.
ఒకవేళ చల్ల నీరు తీసుకోవడానికి ఇబ్బందులు పడితే.. కాచి వడపోసిన నీటిని తీసుకోవాలి. లేదా ఇందులో తేనె వేసుకొని తీసుకోవడం వల్ల పానీయం లాగా మారిపోతుంది.