T20 World Cup 2024: అమెరికా అంటే బేస్ బాల్ గుర్తుకొస్తుంది. అలాంటి చోట ఇప్పుడు క్రికెట్ సందడి మొదలుకానుంది. జూన్ 2 నుంచి అమెరికా వేదికగా టి20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ పొట్టి క్రికెట్ టోర్నీకి అమెరికాతోపాటు వెస్టిండీస్ కూడా ఆతిథ్యం ఇస్తోంది. వెస్టిండీస్ దేశంలో చాలా క్రికెట్ మైదానాలు ఉన్నాయి. అక్కడ కొత్తగా క్రికెట్ ను అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. కానీ అమెరికాలో అలా కాదు. అమెరికాలో వందల ఏళ్ల క్రితమే బ్రిటిష్ కాలనీ ఏర్పడింది. అయితే అక్కడ ఆశించిన స్థాయిలో క్రికెట్ అభివృద్ధి చెందలేదు. అప్పట్లో 60 ఓవర్ల పాటు క్రికెట్ ఉండడం, సంపన్నులకు మాత్రమే ఆడే అవకాశం ఉండడంతో.. అమెరికాలో క్రికెట్ విస్తరించలేదు. అయితే ఇటీవల క్రికెట్ రీచ్ లీగ్ లు పెరిగిపోవడంతో అమెరికాలో కూడా క్రికెట్ అంటే ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఫుట్ బాల్ కు మించి ఈ క్రికెట్ క్రీడను అభివృద్ధి చేయాలని ఐసిసి భావిస్తోంది. ఇందులో భాగంగానే అమెరికా వేదికగా టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తోంది. చరిత్రలో లేని విధంగా 20 జట్లతో టి20 వరల్డ్ కప్ పోటీలు జరపనుంది.
ముందుగానే చెప్పినట్టు క్రికెట్ అభివృద్ధి కోసం ఐసిసి భారీగా ఖర్చు చేసింది. ముఖ్యంగా అమెరికాకు గుండెకాయ లాంటి న్యూయార్క్ నగరంలో నసాబు కౌంటింగ్ క్రికెట్ స్టేడియం నిర్మాణం కోసం ఏకంగా 250 కోట్లు ఖర్చుపెట్టింది. యుద్ధ ప్రాతిపదికన ఈ స్టేడియం నిర్మాణ పనులు పూర్తిచేసింది. ఐసెన్ హోవర్ పార్కులో ఈ స్టేడియాన్ని నిర్మించింది. ఇందులో అత్యధిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించింది. 34,000 మంది కూర్చొని చూసే విధంగా ఈ స్టేడియం రూపొందించింది.
అమెరికా వాతావరణం ప్రకారం అప్పటికప్పుడు క్రికెట్ మైదానంపై పచ్చికను పెంచడం కుదరదు. పైగా టి20 వరల్డ్ కప్ కు షెడ్యూల్ ముంచుకు వస్తుండడంతో ఐసీసీ ఈ మైదానంలో డ్రాప్ ఇన్ పిచ్ లను ఇన్ స్టాల్ చేసింది. డ్రాప్ ఇన్ పిచ్ అంటే మరేంటో కాదు.. ఒకచోట సారవంతమైన మట్టి మీద పచ్చిక పెంచుతారు. ఆ పచ్చికను లేయర్లుగా విడదీస్తారు.. అనంతరం వాటిని మరోచోట ఇన్ స్టాల్ చేస్తారు. దీనివల్ల యుద్ధ ప్రాతిపదికన క్రికెట్ మైదానం తయారు చేసేందుకు వీలవుతుంది.. నసావు కౌంటి క్రికెట్ స్టేడియం నిర్మాణంలోనూ ఐసీసీ డ్రాప్ ఇన్ పిచ్ ను ఇన్ స్టాల్ చేసింది. ఇక ఈ మైదానం వేదికగానే జూన్ 9న ఇండియా – పాకిస్తాన్ జట్ల మధ్య టి20 మ్యాచ్ జరుగుతుంది.
నసావు క్రికెట్ కౌంటి స్టేడియం ఒకప్పుడు ఫుట్ బాల్ మైదానంగా ఉండేది. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి నెల వరకు ఇక్కడ విపరీతంగా మంచి కురుస్తుంది. కనీసం అడుగు కూడా బయట పెట్టడానికి అవకాశం ఉండదు. విపరీతమైన చలి వల్ల అక్కడ జనజీవనం కూడా స్తంభిస్తుంది. ఆ నెలలలో నసావు క్రికెట్ స్టేడియం కూడా గుర్తుపట్టలేని విధంగా మారిపోతుంది. అయితే ప్రపంచ కప్ కోసం మైదానాన్ని సిద్ధం చేయాల్సి రావడంతో ఐసీసీ వెంటనే అప్రమత్తమైంది. మంచు తగ్గడంతో వెంటనే యుద్ధ ప్రాతిపదికన మైదానాన్ని సిద్ధం చేయడం మొదలు పెట్టింది. ఆస్ట్రేలియా ప్రాంతంలో అభివృద్ధి చేసిన డ్రాప్ ఇన్ పిచ్ లను ప్రత్యేకమైన ఓడల ద్వారా తీసుకొచ్చి.. ఇన్ స్టాల్ చేశారు. ఓపెన్ క్రికెట్ అనుభూతిని ఆస్వాదించేలాగా ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా స్టాండ్స్ నిర్మించారు.