Ravi Bishnoi: టీమిండియాలో రవి లాగా వెలగాల్సిన వాడు.. మట్టి పిసుక్కుంటున్నాడు

రవి బిష్ణోయ్ గత ఏడాది భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. వన్డేలు, టి20 మ్యాచ్ లలో పూర్తిస్థాయి ఆటగాడిగా రూపాంతరం చెందాడు. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా అవతరించాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 1, 2024 6:21 pm

Ravi Bishnoi

Follow us on

Ravi Bishnoi: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత మీరు విన్నారా.. ఈ సామెత ఈ క్రికెటర్ కు అచ్చు గుద్దినట్టు సరిపోతుంది.. బ్యాటింగ్ చేయగల నేర్పు ఉండి.. బౌలింగ్ చేసే సత్తా ఉన్నప్పటికీ.. కీలక సమయంలో సరిగ్గా రాణించకపోవడంతో ఈ ఆటగాడు సెలక్టర్లను ఆకట్టుకోలేకపోయాడు. ఫలితంగా టి20 వరల్డ్ కప్ లో చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో గత్యంతరం లేక మట్టి పిసుక్కుంటున్నాడు.

రవి బిష్ణోయ్.. టీమ్ ఇండియా క్రికెట్లో యువ సంచలనంగా పేరుపొందాడు. కానీ అనివార్య కారణాలవల్ల అనుకున్నంత స్థాయిలో ఎదగలేకపోయాడు. ఊహించిన స్థాయిని అందుకోలేకపోయాడు. ఆరాధించే అభిమానులు ఉన్నప్పటికీ.. వారి అంచనాలను రీచ్ కాలేకపోయాడు.. సరిగ్గా ఆడితే అతడు ఈపాటికి టి20 వరల్డ్ కప్ జట్టులో ఉండేవాడు. మిగతా ఆటగాళ్లతో కలిసి న్యూయార్క్ వీధుల్లో సంచరించేవాడు. మైదానంలో వారితో కలిసి ప్రాక్టీస్ చేసేవాడు. కానీ ఇప్పుడు అతడు మట్టి పిసుక్కుంటున్నాడు. సరైన ఆట తీరు ప్రదర్శించకపోవడంతో వరల్డ్ కప్ జట్టులో సెలెక్టర్లు అతనికి అవకాశం ఇవ్వలేదు. ఇతడికి బదులు రాజస్థాన్ రాయల్స్ జట్టులో అద్భుతంగా రాణించిన స్పిన్నర్ యజువేంద్ర చాహల్ కు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు.

రవి బిష్ణోయ్ గత ఏడాది భారత జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. వన్డేలు, టి20 మ్యాచ్ లలో పూర్తిస్థాయి ఆటగాడిగా రూపాంతరం చెందాడు. ముఖ్యంగా టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియాలో కీలక ఆటగాడిగా అవతరించాడు. మెడికల్ తిరిగే లెగ్ కట్టర్స్, ఆశ్చర్యాన్ని కలిగించే గూగ్లీలతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. ఒకానొక దశలో టీమిండియా బౌలింగ్ ను తొలి ఓవర్ ద్వారా తొలి ఓవర్ ద్వారా ప్రారంభించాడు. మెరుగ్గా బౌలింగ్ వేస్తూ పరుగులు కట్టడి చేసేవాడు. వికెట్ల మీద వికెట్లు తీసేవాడు.. ఐపీఎల్ కు ముందు ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో టీమ్ ఇండియా ఆడిన సిరీస్ లో రవి మెరిశాడు. ఆ తర్వాత అతని టీ20 వరల్డ్ కప్ కోసం సిద్ధం చేస్తున్నట్టు టీమ్ ఇండియా మేనేజ్మెంట్ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ అతని జట్టు లోకి తీసుకోలేదు.

ఐపీఎల్ కు ముందు రవి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయితే కీలకమైన ఐపిఎల్ లో విఫలమయ్యాడు. వికెట్లు తీయలేక భారీగా పరుగులు ఇచ్చాడు. ఫలితంగా అతని కష్టం కాస్తా వృధా అయ్యింది. ఐపీఎల్ ను లెక్కలోకి తీసుకోమని.. ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఆట తీరును మాత్రమే లెక్కలోకి తీసుకుంటామని బీసీసీఐ ప్రకటించింది. కానీ కీలక దశలో అతనికి హ్యాండ్ ఇచ్చింది.. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, మహమ్మద్ సిరాజ్, రోహిత్ శర్మ వంటి వారు ఐపీఎల్లో విఫలమైనప్పటికీ వారికి బీసీసీఐ అవకాశం ఇచ్చింది. ఇదే సమయంలో రింకూ సింగ్, రవి బిష్ణోయ్ విషయంలో మాత్రం ఐపీఎల్ లో ప్రతిభను పరిగణలోకి తీసుకొని.. వారిని t20 వరల్డ్ కప్ కు ఎంపిక చేయలేదు. ఒక రవికి బదులు యజువేంద్ర చాహల్ ను బీసీసీఐ టీంలోకి తీసుకుంది.

తనకు ఎదురైన అవమానాన్ని తట్టుకోలేక రవి ఐపీఎల్ ముగిసిన వెంటనే స్వగ్రామానికి తనకు ఎదురైన అవమానాన్ని తట్టుకోలేక రవి ఐపీఎల్ ముగిసిన వెంటనే స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడ తన బంధువులతో కలిసి సరదాగా గడుపుతున్నాడు. ఈ క్రమంలో తన పూర్వికులు తయారు చేస్తున్న మట్టి పోయ్యిని పరిశీలిస్తూ ఫోటోలు దిగాడు. వాటిని తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పోస్ట్ చేశాడు. “బీసీసీఐ అవకాశాలు ఇవ్వకపోవడంతో. ప్రతిభ ఉన్నప్పటికీ కొంతమంది ఆటగాళ్ళు ఇలా మట్టి పిసుక్కుంటున్నారు. బీసీసీఐ దుర్మార్గ రాజకీయాల వల్ల ఒక వర్ధమాన ఆటగాడికి ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని” నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.