ఎలాంటి భారీ అంచనాలు లేవు.. మొన్నటి దాకా ప్రతీ మ్యాచ్‌లోనూ విఫలం.. అయినా చివరికి డూ ఆర్ డై మ్యాచ్‌లో తన సత్తా చాటింది. చివరికి ఫైనల్ చేరింది ఢిల్లీ కేపిటల్స్ జట్టు. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో సాగుతున్న ఐపీఎల్ -2020 సీజన్ 13వ ఎడిషన్‌లో ఢిల్లీ కేపిటల్స్ ఫైనల్‌లో అడుగు పెట్టింది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఢిల్లీ కేపిటల్స్.. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో ఎంట్రీ ఇవ్వడం ఇదే తొలిసారి.
Also Read: కోహ్లి ఉన్నన్ని రోజులు బెంగళూరుకు కప్ రాదంట
2008లో ఐపీఎల్ ఆరంభమైన తరువాత.. ఇప్పటిదాకా ఆ జట్టు ఫైనల్ ముఖం చూడలేదు. దీన్ని తిరగరాసిందా టీమ్. రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఐపీఎల్ ఆరంభమైన 12 సంవత్సరాల తరువాత ఫైనల్‌లో మ్యాచ్‌లో గ్రాండ్‌కు అడుగు పెట్టింది. మంగళవారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో డిపెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌ను ఢీ కొట్టబోతోంది. ఎమిరేట్స్ రాజధాని అబుధాబిలోని షేక్ జయేద్ స్టేడియంలో ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను మట్టి కరిపించింది ఢిల్లీ కేపిటల్స్. బ్యాటింగ్, బౌలింగ్‌లో సమష్టిగా రాణించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ టీమ్ 189 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్లందరూ దూకుడుగా ఆడారు. బౌలర్లపై ఎదురుదాడి చేశారు. ఓపెనర్లు మార్కస్ స్టోయినిస్, శిఖర్ ధావన్, మిడిలార్డర్‌లో షిమ్రోన్ హెట్మయిర్ విజృంభించారు. భారీ లక్ష్యాన్ని ముందుంచారు.
Also Read: కప్‌కు రెండడుగుల దూరంలో సన్‌రైజర్స్ హైదరాబాద్
అయితే.. 190 పరుగుల టార్గెట్‌ను ఛేజ్ చేసే ప్రయత్నంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తొలుత తడబడింది. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో నిలకడగా రాణించింది. చివరికంటా పోరాడింది. ఓవర్ ఓవర్‌కూ రన్‌రేట్ పెరిగిపోతుండటంతో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్లు ఒత్తిడికి గురయ్యారు. భారీ షాట్లకు ప్రయత్నించి అవుట్ అయ్యారు. మిడిల్ ఆర్డర్‌లో కేన్ విలియమ్సన్ ఒక్కడే క్రీజ్‌లో కుదురుకోగలిగాడు. భారీ భాగస్వామ్యాన్ని అందించలేకపోయారు. కేన్ విలియమ్సన్-జేసన్ హోల్డర్, కేన్ విలియమ్సన్-అబ్దుల్ సమద్.. క్రీజ్‌లో ఉన్నంత సేపూ గెలుపుపై ఢోకా లేదనిపించింది. ఒక్క పరుగు తేడాతో మూడు వికెట్లను కోల్పోవడంతో పరాజయం ఖాయమైంది.