పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్.. రూ.100 తో లక్షలు మీ సొంతం..!

ఈ మధ్య కాలంలో బ్యాంకులు, పోస్టాఫీసులు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీసులపై ప్రజలకు అవగాహన తక్కువ కానీ అందులో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మంచి రాబడి అందిస్తూ పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా కచ్చితమైన లాభాలు పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో […]

Written By: Navya, Updated On : November 9, 2020 9:48 am
Follow us on


ఈ మధ్య కాలంలో బ్యాంకులు, పోస్టాఫీసులు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఎన్నో కొత్త స్కీమ్ లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఈ స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. పోస్టాఫీసులపై ప్రజలకు అవగాహన తక్కువ కానీ అందులో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ మంచి రాబడి అందిస్తూ పెట్టుబడులు పెట్టిన వాళ్లకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది.

రికరింగ్ డిపాజిట్ స్కీమ్ ద్వారా కచ్చితమైన లాభాలు పొందే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలామంది ఈ స్కీమ్ లలో పెట్టుబడులు పెట్టటానికి ఆసక్తి చూపుతున్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలకు ఈ స్కీమ్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. 100 రూపాయల నుంచి పెట్టుబడి పెడుతూ ఈ స్కీమ్ లో జాయిన్ కావచ్చు. పోస్టాఫీస్ లో ఖాతా తెరిచి ఈ స్కీమ్ లో సులువుగా డిపాజిట్ చేయవచ్చు.

ప్రతి నెలా ఒకే మొత్తంలో రికరింగ్ డిపాజిట్ స్కీమ్ లలో పెట్టుబడులు పెడుతూ లాభాలను సొంతం చేసుకోవచ్చు. నచ్చిన కాలపరిమితిని ఎంచుకుని డిపాజిట్ చేసే సౌకర్యం ఉండటం వల్ల వినియోగదారులకు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం చేకూరనుంది. గరిష్ట పరిమితి లేకపోవడం వల్ల 100 రూపాయల నుంచి ఎంత మొత్తమైనా ఇందులో డిపాజిట్ చేయవచ్చు.

ప్రస్తుతం పోస్టాఫీసులు ఈ డిపాజిట్లకు 5.8 శాతం వడ్డీని అందిస్తున్నాయి. నెలకు 3,000 రూపాయల చొప్పున రికరింగ్ డిపాజిట్ ఖాతాలలో నగదు జమ చేస్తే లక్షల్లో పొందే అవకాశం ఉంటుంది. ప్రతి 90 రోజులకు ఒకసారి వడ్డీ డబ్బులు ఖాతాలలో జమవుతాయి.