Tollywood: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరూ ఈ సంవత్సరం సినిమాలను రిలీజ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇక గత సంవత్సరంలో కొంతమంది హీరోలు కనిపించనప్పటికీ ఈ సంవత్సరం మాత్రం పక్కాగా కనిపించి భారీ సక్సెస్ ని సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే ఆల్రెడీ ఈ ఇయర్ లో నాలుగు నెలలు గడిచిపోయాయి.
కాబట్టి ఇక మిగిలిన ఏడు నెలల్లో మన స్టార్ హీరోల సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక అందులో భాగంగానే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2, ఎన్టీయార్ దేవర, పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజి, రామ్ చరణ్ గేమ్ చేంజర్, ప్రభాస్ కల్కి లాంటి సినిమాలతో ఈ సంవత్సరం భారీ సక్సెస్ ని అందుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ఈ సంవత్సరం ఎవరైతే భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధిస్తారో వాళ్ళు పాన్ ఇండియా లోనే స్టార్ హీరోగా అవతరించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఈ హీరోలందరు ఒకే సంవత్సరంలో రాబోతున్నారు. కాబట్టి ఎవరి సినిమా ఈ ఇయర్ లో బిగ్గెస్ట్ సక్సెస్ ని సాధిస్తుందో ఆ హీరో స్టార్ హీరోగా గుర్తింపు పొందే అవకాశాలైతే ఉన్నాయి.
కాబట్టి ప్రతి ఒక్క హీరో తమ తమ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని చూస్తున్నారు. ఈ సంవత్సరం వస్తున్న అందరు హీరోలు పాన్ ఇండియా సినిమాలతో రావడం వల్ల ఇండియాలోనే ఫస్ట్ టైమ్ తెలుగు హీరోలు భారీ ఎత్తున బాలీవుడ్ మీద దండయాత్ర చేయబోతున్నారనే చెప్పాలి… ఇక ఈ సినిమాలతో తెలుగు సినిమా స్థాయి అనేది భారీగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి…
మరి బాలీవుడ్ దిగ్గజ హీరోలు మన హీరోలతో పాటు పోటీకి వస్తారా లేదంటే సైడ్ అయిపోతారా.? అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ సంవత్సరం పాన్ ఇండియాలో తెలుగు సినిమాలదే హవా నడవబోతున్నట్టుగా తెలుస్తుంది…