https://oktelugu.com/

IPL 2025 : ఆ ముగ్గురిపై కావ్య మారన్ కన్ను.. దక్కించుకోవడానికి ఎలాంటి ప్లాన్ వేసిందంటే?

ఐపీఎల్ 2025 సీజన్ కు ఘనంగా నిర్వహించడానికి బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. దానికంటే ముందు అంతకుమించి అనే విధంగా మెగా వేలం నిర్వహించనుంది. నవంబర్ 24, 25 తేదీలలో సౌదీ అరేబియాలోని జెడ్డా లో మెగా వేలం నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2024 / 10:05 PM IST

    IPL 2025

    Follow us on

    IPL 2025 : ఇండియన్ టైమింగ్స్ ప్రకారం ఈ వేలం మధ్యాహ్నం 3 గంటలకు మొదలవుతుంది. బీసీసీఐ ఐపీఎల్ వేలాన్ని వరుసగా రెండోసారి విదేశాలలో నిర్వహిస్తున్నది. 1574 మంది ఆటగాళ్లు తమ పేర్లను వేలంలో నమోదు చేసుకున్నారు. అయితే బీసీసీఐ సూచనల మేరకు ఐపీఎల్ వేలం కమిటీ 574 మంది ఆటగాళ్లను దానికి ఎంపిక చేసింది. ఇందులో 204 మంది ఆటగాళ్ళను కొనుగోలు చేసేందుకు ఈ యాజమాన్యాలు రెడీ అయ్యాయి. అయితే ఇందులో 70 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. షార్ట్ లిస్టులో 366 మంది ఇండియన్ ప్లేయర్స్, 208 మంది ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు. అయితే కొన్ని జట్లు వేలంలో ఆటగాళ్ళను దక్కించుకోవడానికి వ్యూహాత్మకమైన పద్ధతులను పాటిస్తున్నాయి. ఇందులో ఆర్టీఎం కార్డును తెరపైకి తీసుకొస్తున్నాయి. దానిద్వారా ఎవర్ని కొనుగోలు చేయాలి? ఎవరికోసం భారీ ధరను వెచ్చించాలనే నిర్ణయాలను తీసుకున్నట్టు తెలుస్తోంది.

    తక్కువ మొత్తంతో.. నాణ్యమైన ఆటగాళ్లు కొనుగోలు

    హైదరాబాద్ జట్టు వద్ద ఒకే ఒక ఆర్టీఎం ఉంది. దానిద్వారా ముగ్గురు స్టార్ ఆటగాళ్లల్లో ఒకరిని కొనుగోలు చేయాలని భావిస్తోంది. ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఐదుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. 75 కోట్లతో అభిషేక్ శర్మ, హెడ్, కమిన్స్, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్ ను రిటైన్ చేసుకుంది. ఇక మిగిలిన 45 కోట్లతో హైదరాబాద్ జట్టు గరిష్టంగా 20 మంది ప్లేయర్లను కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు అవకాశం ఉంటుంది. ఇక హైదరాబాద్ సీఈఓ కావ్య తన దగ్గర ఉన్న తక్కువ మొత్తం తోనే క్వాలిటీ ప్లేయర్లను ఓన్ చేసుకోవాలని భావిస్తుంది. ఆన్ క్యాప్డ్ ఆర్టిఎం కార్డు ను జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని భావిస్తోంది. ఆర్టీఎం ద్వారా అబ్దుల్ సమద్, సన్వీర్ సింగ్, మయాంక్ మార్కండే పై కావ్య దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో ఒకరిని తమ స్క్వాడ్ లోకి తీసుకురావాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

    ఐదు సీజన్లో హైదరాబాద్ వెంటే..

    అబ్దుల్ సమద్ ఐదు సీజన్లో హైదరాబాద్ జట్టు వెంటే ఉన్నాడు. అతడు భారీ హిట్టర్. కొన్ని మ్యాచ్లలో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఇటీవల అతడు అంచనాలు అందుకోలేక విఫలమవుతున్నాడు. 16 ఇన్నింగ్స్ లలో 182 రన్స్ చేశాడు. రియాన్ పరాగ్ కు రాజస్థాన్ జట్టు సపోర్ట్ ఇచ్చినట్టు.. అబ్దుల్ సమద్ కు కావ్య అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ అబ్దుల్ సమద్ లభించకపోతే ఆర్టీఎం ద్వారా సన్వీర్ సింగ్ ను రిటర్న్ చేసుకుని అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సన్వీర్ హైదరాబాద్ జట్టు తరఫున రెండు సీజన్లో 6 ఇన్నింగ్స్ లు ఆడాడు. మూడుసార్లు నాట్ అవుట్ గా నిలిచి 25 రన్స్ మాత్రమే చేశాడు. అయితే ఇతర గ్రేట్ 187 వద్ద కొనసాగిస్తున్నాడు. మరోవైపు మయాంక్ మార్కండే కూడా హైదరాబాద్ జట్టు ఆర్టీఎం పొటెన్షియల్ జాబితాలో ఉన్నాడు. అయితే ఇతడికి ఆరు సీజన్లలో అనుభవం ఉన్న నేపథ్యంలో అది జట్టుకు భారీగా ఉపకరిస్తుందని కావ్య యోచిస్తోంది.