https://oktelugu.com/

Samantha Ruth Prabhu : అక్షరాలా 1100 కోట్లు పోగొట్టుకున్న సమంత.. ఇంతటి అన్యాయం ఏ హీరోయిన్ కి జరిగి ఉండదు!

తెలుగులో ఈమె రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది. అదే విధంగా నిర్మాతగా పలు చిన్న చిత్రాలను నిర్మించడంతో పాటు,, రెండు మూడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా ఈమె నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : November 16, 2024 / 08:57 PM IST

    Samantha Prabhanjanam in 150 countries..top 10 everywhere..this is the first time in history!

    Follow us on

    Samantha Ruth Prabhu : సౌత్ ఇండియాలో హీరోయిన్స్ లో మంచి క్రేజ్, ఫాలోయింగ్ ఉన్నవారిలో సమంత కచ్చితంగా టాప్ 3 లో ఉంటుంది. నిన్న మొన్నటి వరకు కేవలం టాలీవుడ్ , కోలీవుడ్ సినిమాలకు మాత్రమే పరిమితమైన సమంత, ఇప్పుడు బాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2 ‘ వెబ్ సిరీస్ తో విలన్ రోల్ ద్వారా అక్కడి ఆడియన్స్ లో మంచి పాపులారిటీ ని సంపాదించిన ఆమె, రీసెంట్ గానే ‘సిటాడెల్’ అనే మరో బాలీవుడ్ వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చింది. ఈ సిరీస్ కి కూడా ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే నాగ చైతన్య తో విడాకులు జరిగిన తర్వాత సమంత కి ‘మయోసిటిస్’ అనే వ్యాధి సోకిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ వ్యాధి ఆమె జీవితాన్ని నాశనం చేసింది అనే చెప్పాలి.

    ప్రాణాంతక వ్యాధిగా డాక్టర్ల చే పరిగణింపబడిన ఈ వ్యాధి సోకినప్పుడు సమంత కి సరిగా ఊపిరి కూడా అందేది కాదు. ‘సిటాడెల్’ షూటింగ్ సమయంలో ఆమె ఆక్సిజన్ సీలిండర్స్ ని పెట్టుకొని పని చేసేదని ఆ వెబ్ సిరీస్ లో హీరో గా చేసిన వరుణ్ ధావన్ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాధి కారణంగా సమంత ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్ ని వదులుకోవాల్సి వచ్చిందట. అందులో షారుఖ్ ఖాన్ హీరో గా నటించిన ‘జవాన్’ చిత్రం కూడా ఉంది. ఇందులో నయనతార కంటే ముందుగా సమంత నే తీసుకున్నారు. ఆమెతో అగ్రిమెంట్ కూడా చేయించుకున్నారు. కానీ సమంత కి ఆరోగ్యం ఇలా క్షీణించడంతో ఆమె ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సుమారుగా 1200 కోట్ల రూపాయిల గ్రాస్ ని ఈ చిత్రం రాబట్టింది.

    సమంత కి కూడా ఈ సినిమాలో రెమ్యూనరేషన్ దాదాపుగా 20 కోట్ల రూపాయిలు ఇస్తామని అన్నారట. ఈ సినిమా ఆమె చేసి ఉండుంటే ఈరోజు ఆమె రేంజ్ బాలీవుడ్ లో ఇంకా పెద్దగా ఉండేది. ఎందుకంటే సమంత కి ముందు నుండే బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. ఒర్మాక్స్ సంస్థ ప్రతీ ఏడాది విడుదల చేసే టాప్ 10 హీరోయిన్స్ లిస్ట్ సమంత నెంబర్ 1 స్థానం లో ఉంటుంది. దీనిని బట్టి ఇండియా వైడ్ ఆమెకి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. త్వరలోనే ఈమె సల్మాన్ ఖాన్ తో కలిసి ఒక సినిమా చేయబోతుంది. ఈ చిత్రం తో పాటు తెలుగులో ఈమె రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా నటించబోతుంది. అదే విధంగా నిర్మాతగా పలు చిన్న చిత్రాలను నిర్మించడంతో పాటు,, రెండు మూడు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో కూడా ఈమె నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.