Champions Trophy 2025 : బీసీసీఐ, జై షా తమదైన శైలిలో ఆగ్రహం, నిరసన వ్యక్తం చేయడంతో పాకిస్తాన్ కు సెగ తగిలింది. దీంతో పిఓకే ప్రాంతాలలో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రదర్శన నిలిచిపోయింది. అది లేకుండానే టూర్ షెడ్యూల్ ను ఐసీసీ వెల్లడించింది. అయితే ఈ టోర్నీలో పాలుపంచుకునే 8 జట్ల సొంత దేశాలలో దాదాపు 70 రోజులపాటు ట్రోఫీ ప్రదర్శన ఉంటుంది. చివరిగా ఇది భారత్ చేరుకుంటుంది. ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇస్తోంది. 1996 తర్వాత ఐసీసీ నిర్వహించే మెగా టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వడం ఇది తొలిసారి. అయితే ఈ ట్రోఫీలో ఆడేందుకు తమ జట్టు రాదని ఐసీసీకి బీసీసీఐ వెల్లడించింది. దీంతో పాకిస్తాన్ “ప్లాన్ బీ” అమలు చేసింది. తమ దేశంలో ఆడేందుకు రావాలని మాజీ ఆటగాళ్లతో భారత క్రికెటర్లకు పాకిస్తాన్ విజ్ఞప్తులు చేయించింది. అయితే అవి వర్కౌట్ కాలేదు. ఈ క్రమంలోనే ఆసియా కప్ మాదిరిగానే ఛాంపియన్స్ ట్రోఫీ ని కూడా హైబ్రిడ్ మోడల్ జరపాలని భారత్ కోరింది.
గత ఆసియా కప్ లో..
గత ఏడాది ఆసియా కప్ జరగగా.. దానికి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చింది. ఆ టోర్నీలో భారత్ ఆడిన మ్యాచులను మొత్తం ఐసీసీ శ్రీలంకలో జరిపింది. ప్రస్తుత ఛాంపియన్స్ ట్రోఫీలో తమ దేశంలో ఆడేందుకు భారత్ ను రప్పించాలని పాకిస్తాన్ ప్రయత్నాలు చేసినప్పటికీ అవి ఫలప్రదం కాలేదు. దీంతో హైబ్రిడ్ మోడల్ వైపే అడుగులు పడుతున్నాయి. దీనిని మనసులో పెట్టుకున్న పాకిస్తాన్ తను ఆక్రమించిన స్కర్దు, ముజఫర్బాద్, హుంజా అనే ప్రాంతంలో ఛాంపియన్స్ ట్రోఫీని ప్రదర్శించాలని భావించింది. అయితే దీనిని బిసిసిఐ ఖండించింది. జై షా తప్పు పట్టారు. ఫలితంగా ఐసిసి రంగాల్లోకి దిగింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఛాంపియన్స్ ట్రోఫీని ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. అంతేకాకుండా ట్రోఫీ టూర్ షెడ్యూల్ కూడా వెల్లడించింది. 2008 ముంబై దాడుల నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ లో పర్యటించడం లేదు. ఇక ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ వేదికగా జరుగుతుంది.
ట్రోఫీ టూర్ ఇలా సాగుతుంది
నవంబర్ 16న పాకిస్తాన్ లోని ఇస్లామాబాద్.
నవంబర్ 17 పాకిస్తాన్ లోని తక్షిలా, కాన్పూర్ .
నవంబర్ 18 పాక్ లోని అబోటాబాద్.
నవంబర్ 18 పాక్ లోని ముర్రే
నంబర్ 20 పాక్ లోని నథియా గలి.
నవంబర్ 22 నుంచి 25 వరకు కరాచీ నగరంలో.
నవంబర్ 26 నుంచి 28 వరకు ఆఫ్ఘనిస్తాన్.
డిసెంబర్ 10 నుంచి 13 వరకు బంగ్లాదేశ్
డిసెంబర్ 15 నుంచి 22 దక్షిణాఫ్రికా
డిసెంబర్ 25 నుంచి జనవరి 5 వరకు ఆస్ట్రేలియా
జనవరి 6 నుంచి 11 వరకు న్యూజిలాండ్
జనవరి 12 నుంచి 14 ఇంగ్లాండ్
జనవరి 15 నుంచి 26 భారత్
జనవరి 27 నుంచి పాకిస్తాన్ లో ఈవెంట్ మొదలవుతుంది.