సన్ రైజర్స్, బెంగళూరు మ్యాచ్: అంపైరింగ్‌పై ప్లేయర్స్‌ ఆరోపణలు

రాయల్‌ ఛాలెంజర్స్‌, సన్ ‌రైజర్స్‌ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ వివాదాలకు దారితీస్తోంది. అంపైరింగ్‌ తప్పిదాలతో మ్యాచ్‌ కోల్పోయామంటూ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా.. ఇప్పుడు మరో కాంట్రవర్సీ చెలరేగింది. అది కూడా అంపైరింగ్‌పైనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంపైర్ తీసుకున్న నిర్ణయంపై కొందరు మాజీ క్రికెటర్లు.. యంగ్ బౌలర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా వారంతా రియాక్ట్ అయ్యారు. Also Read: ఆస్ట్రేలియా టూర్ కు రోహిత్ పై రేపు […]

Written By: NARESH, Updated On : November 1, 2020 5:07 pm
Follow us on


రాయల్‌ ఛాలెంజర్స్‌, సన్ ‌రైజర్స్‌ మధ్య నిన్న జరిగిన మ్యాచ్‌ వివాదాలకు దారితీస్తోంది. అంపైరింగ్‌ తప్పిదాలతో మ్యాచ్‌ కోల్పోయామంటూ బెంగళూరు కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఆగ్రహాన్ని వ్యక్తం చేయగా.. ఇప్పుడు మరో కాంట్రవర్సీ చెలరేగింది. అది కూడా అంపైరింగ్‌పైనే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంపైర్ తీసుకున్న నిర్ణయంపై కొందరు మాజీ క్రికెటర్లు.. యంగ్ బౌలర్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా వారంతా రియాక్ట్ అయ్యారు.

Also Read: ఆస్ట్రేలియా టూర్ కు రోహిత్ పై రేపు బీసీసీఐ కీలక నిర్ణయం

షార్జా స్టేడియంలో శనివారం రాత్రి సన్ రైజర్స్‌ హైదరాబాద్‌, రాయల్ ఛాలెంజర్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో అంపైర్ వివాదాస్పద నిర్ణయాన్ని తీసుకున్నారు. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ నిర్దేశించిన 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి సన్‌రైజర్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఇన్నింగ్ 10వ ఓవర్‌ను బెంగళూరు బౌలర్ ఇసురు ఉడన వేశాడు. ఆ ఓవర్ మూడోబంతిని ఉడన.. స్లోవర్‌గా సంధించాడు. దాన్ని కేన్ విలియమ్సన్ ఎదుర్కొన్నాడు. హై ఫుల్‌టాస్ రూపంలో వచ్చిన బాల్ అది. ఆ బంతిని ఫైన్ లెగ్ వైపు ఆడాడు. ఒక పరుగు తీశాడు.

నడుము కంటే ఎత్తుకు.. భుజాల కింద కాస్త దిగువకు ఆ బాల్ దూసుకొచ్చింది. దాన్ని అంపైర్ నో బాల్‌గా ప్రకటించలేదు. దీంతో కేన్ విలియమ్సన్ అసహనం వ్యక్తం చేశాడు. దీనిపై టర్బొనేటర్ హర్బజన్ సింగ్, టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అంపైర్ నిర్ణయాన్ని తప్పు పట్టారు. నో బాల్‌గా అంత స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ.. అంపైర్ స్పందించకపోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ జోఫ్రా ఆర్చర్ కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

Also Read: కోల్ కతా ఆశలపై చెన్నై నీళ్లు.. ప్లే ఆఫ్ రేసు రసవత్తరం!

ఐపీఎల్‌ వేదికగా ఏకంగా అంపైర్‌‌ పైనే ఆరోపణలు రావడంపై అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంపైర్‌‌ ఏ నిర్ణయం తీసుకున్నా ఫైనల్‌గా ఫిక్స్‌ కావాల్సిన ప్లేయర్స్‌ కూడా ఇలా ఆరోపణలు దిగడంపైనా అందరూ హతాశులయ్యారు.