https://oktelugu.com/

బీజేపీ ని లెక్కలతో కొట్టిన కేటీఆర్!

దుబ్బాక ఉప ఎన్నిక వేదికగా ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవల పట్టుబడ్డ డబ్బుల విషయాన్ని బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీసులతో బీజేపీ క్యాండిడేట్ల ఇంట్లో డబ్బులు పెట్టించి.. బుక్‌ చేయాలని చూశారని బీజేపీ నేతలు ఆరోపించారు. టీఆర్‌‌ఎస్‌ నేతలేమో అవి బీజేపీ క్యాండిడేట్‌ డబ్బులంటూ దబాయించింది. దీంతో ఈ వివాదం రాజుకుంది. మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్ ఇక అప్పటి నుంచి బీజేపీ, టీఆర్‌‌ఎస్‌ల మధ్య […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 02:54 PM IST
    Follow us on

    దుబ్బాక ఉప ఎన్నిక వేదికగా ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీ అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇటీవల పట్టుబడ్డ డబ్బుల విషయాన్ని బీజేపీ నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోలీసులతో బీజేపీ క్యాండిడేట్ల ఇంట్లో డబ్బులు పెట్టించి.. బుక్‌ చేయాలని చూశారని బీజేపీ నేతలు ఆరోపించారు. టీఆర్‌‌ఎస్‌ నేతలేమో అవి బీజేపీ క్యాండిడేట్‌ డబ్బులంటూ దబాయించింది. దీంతో ఈ వివాదం రాజుకుంది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    ఇక అప్పటి నుంచి బీజేపీ, టీఆర్‌‌ఎస్‌ల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. మరోవైపు ప్రచారంలో పాల్గొంటున్న బీజేపీ నేతలు రాష్ట్ర అమలు చేస్తున్న పథకాల్లో సగం వాటా కేంద్రానిదే అంటూ చెప్పుకొస్తున్నారు. చివరకు టీఆర్‌‌ఎస్‌ ప్రభుత్వం ఇస్తున్న పింఛన్లలోనూ కేంద్ర ప్రభుత్వం వాటా ఉందని అంటున్నారు. దీంతో వాటిని టీఆర్‌‌ఎస్‌ మంత్రులు ఛాలెంజ్‌గా తీసుకున్నారు.  అటు మంత్రి హరీష్‌ రావు, ఇటు కేటీఆర్‌‌ కేంద్రంపై కత్తులు నూరుతున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్‌‌ కూడా తాజాగా కేంద్ర ప్రభుత్వం మీద యుద్దం ప్రకటించాలంటూ ప్రకటనలు చేశారు.

    Also Read: బండి సంజయ్‌.. వీటికి సమాధానాలు చెప్పు: హరీష్ రావు

    దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారం నేటితో ముగియబోతోంది. మంగళవారం పోలింగ్‌ జరగనుండగా.. ఈనెల 10న ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచారం చివరి రోజున టీఆర్‌‌ఎస్‌ నేతలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా.. కేటీఆర్‌‌ కొన్ని లెక్కలను ట్విట్టర్‌‌ వేదికగా బయటపెట్టారు. కేంద్రంలోని బీజేపీ నుంచి తెలంగాణకు అందుతున్న సాయంపై వివరించారు.

    Also Read: దేశంలోనే ఏపీకి అత్యంత అన్యాయం: జగన్

    2014 నుంచి పన్నుల రూపంలో రాష్ట్రం నుంచి 2,72,926 కోట్లు కేంద్రానికి చెల్లించామని వివరించారు. అయితే.. కేంద్రం నుంచి మాత్రం రాష్ట్రానికి 1,40,329 కోట్లు మాత్రమే వచ్చాయని చెప్పారు. భారత ఆర్థిక రంగాభివృద్ధికి తెలంగాణ గొప్ప పాత్ర పోసిస్తోందని చెప్పుకొచ్చారు.