India Vs England 1st Test: కామెంటరీ బాక్సులోనే పీటర్సన్ ను కడిగేసిన సునీల్ గవాస్కర్.. అసలు ఏమైందంటే..?

పీటర్సన్ కూడా ఇండియాలో ఉన్న పిచ్ లు అన్ని ఇలానే ఉంటాయి అని అనగా, గవాస్కర్ మళ్ళీ బదులు ఇస్తు 'పిచ్ లు ఎలా ఉన్నా ప్లేయర్ తటస్థంగా ఆడాల్సిందే ' అంటూ మాట్లాడుతూనే రెండు టీమ్ ల మధ్య పోటీ జరుగుతున్నప్పుడు ఎంత గొప్ప వ్యాఖ్యతలు అయిన కూడా తటస్థం గా ఉండడం చాలా కష్టం అంటూ నవ్వాడు.

Written By: Gopi, Updated On : January 27, 2024 5:51 pm
Follow us on

India Vs England 1st Test: ఇండియా ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో ప్లేయర్లు, అభిమానుల మధ్య పోటీనే కాకుండా కామెంటేటర్ల మధ్య కూడా పోటీ వాతావరణం నెలకొంది. ఇక ఒకప్పటి ఇండియన్ లెజెండరీ క్రికెటర్ అయిన సునీల్ గవాస్కర్ అలాగే ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ అయిన కెవిన్ పీటర్సన్ మొదటి టెస్ట్ కు కమెంటేటర్లు గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే…అయితే పీటర్సన్ మాట్లాడిన మాటలకు గవాస్కర్ ఆయన మీద ఫైర్ అయ్యాడు.అసలు మ్యటారెంటంటే…

ఇక ఈ మ్యాచ్ లో భాగంగా రెండోవ రోజు చివరి సెషన్ లో మొదటి రోజు ఆట గురించి గవాస్కర్, పీటర్సన్ ఇద్దరు చర్చించుకున్నారు. మొదట ఇంగ్లాండ్ 55-0 గా మెరుగైన స్థితి లో ఉండగా, ఆ తర్వాత జడేజా, అశ్విన్ లా ధాటికి 60-3 గా మారిపోయింది. ఇక దాంతో పీటర్సన్ ‘ఇండియన్ పిచ్ లు స్పిన్ కి బాగా అనుకూలిస్తాయి. ఎక్కడైనా పిచ్ లు మొదటి రెండు రోజులు అయిపోయిన తర్వాత స్పిన్ కి బాగా అనుకూలిస్తాయి. కానీ ఇండియాలో మొదటి రోజు నుంచే స్పిన్ బౌలర్ల బాల్ స్వింగ్ అవుతుంది ‘ అంటూ కామెంట్ చేశాడు. ఇక దానికి సునీల్ గవాస్కర్ బదులిస్తూ ‘బాల్ స్వింగ్ అవుతుందా, అవ్వట్లేదా అని చూడకండి, బౌలర్లు ప్లేయర్లని ఎలా అవుట్ చేశారు. అనేది మాత్రమే అబ్జర్వ్ చేయండి ‘ అంటూ గవాస్కర్ పీటర్సన్ కి కౌంటర్ వేశాడు.

ఇక పీటర్సన్ కూడా ఇండియాలో ఉన్న పిచ్ లు అన్ని ఇలానే ఉంటాయి అని అనగా, గవాస్కర్ మళ్ళీ బదులు ఇస్తు ‘పిచ్ లు ఎలా ఉన్నా ప్లేయర్ తటస్థంగా ఆడాల్సిందే ‘ అంటూ మాట్లాడుతూనే రెండు టీమ్ ల మధ్య పోటీ జరుగుతున్నప్పుడు ఎంత గొప్ప వ్యాఖ్యతలు అయిన కూడా తటస్థం గా ఉండడం చాలా కష్టం అంటూ నవ్వాడు. ఇక దాంతో పీటర్సన్ కూడా నవ్వాడు ఇలా ఇద్దరి మధ్య మాటల యుద్దాన్ని ఒక పోగిలా కొనసాగించడం ఇష్టం లేక సునీల్ గవాస్కర్ ఆ డిస్కషన్ కి ఎండ్ కార్డ్ వేశాడు.

ఇక కమెంటేటర్లు మ్యాచ్ చూస్తున్నప్పుడు ఎవరి టీమ్ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్లు కామెంటేటర్లు గా కూర్చున్నా కూడా ముందు వాళ్ల దేశం గెలవాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు వాళ్ల దేశాలకు సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతూ ఉంటారు అనేది మరొకసారి ప్రూవ్ అయింది… ఇక ఈమ్యాచ్ లో రెండు జట్లూ కూడా మంచి పర్ఫామెన్స్ ని ఇస్తు ఆడుతున్నాయి…