Homeబిజినెస్POCO C85X: మధ్యతరగతి ప్రజలు కోరుకునే మొబైల్ మార్కెట్లోకి వస్తోంది.. ధర ఎంత అంటే?

POCO C85X: మధ్యతరగతి ప్రజలు కోరుకునే మొబైల్ మార్కెట్లోకి వస్తోంది.. ధర ఎంత అంటే?

POCO C85X: చైనా కంపెనీ POCO భారతదేశంలో తన మొబైల్స్ ను ఒక్కొక్కటి రిలీజ్ చేస్తుంది. 2025 డిసెంబర్లో Poco C85 రిలీజ్ తర్వాత.. మరో కొత్త ఫోన్ తో రాబోతుంది. 2026 మార్చి 10న POCO C85X అనే మొబైల్ ను మార్చి 10న మార్కెట్లోకి తీసుకు రాబోతుంది. ఇప్పటివరకు రిలీజ్ అయిన C 85 కంటే ఈ కొత్త మొబైల్ అప్డేట్ ఫీచర్స్ తో పాటు.. డిస్ప్లే, బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న వినియోగదారులు కోరుకునే ఫీచర్లు ఇందులో ఉండలు ఉన్నాయి. ఈ మొబైల్ ఎలా ఉండబోతుంది అంటే?

Also Read: ఘనంగా జరిగిన హీరో అల్లు శిరీష్ వివాహం..సినీ ఇండస్ట్రీ నుండి ఎవరెవరు వచ్చారంటే!

POCO C 85 X మొబైల్ ఆధునికరించబడిన ప్రాణాలతో కనిపిస్తుంది. దీనికి డ్యూయల్ టోన్ వెనుక ప్యానెల్ ఉంటుంది. గోల్డ్ కలర్ లో వచ్చి ఆకర్షించనుంది. బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ వద్ద LED ఫ్లాష్ లైట్ కనిపిస్తుంది. డ్యూయల్ రియర్ కెమెరా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ కెమెరా పిల్ ఆకారంలో ఉండడంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఇందులో 6.9 అంగుళాల HD + బ్యాటరీని ఉంచారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. 810 nits బ్రైట్నెస్ తో పనిచేసే ఈ మొబైల్ లో 6nm అక్టా కోర్ మీడియా టెక్ డైమెన్సిటీ 6300 చిప్ సెట్ కనిపిస్తుంది.

ఈ మొబైల్ లో డ్యూయల్ కెమెరా చూడవచ్చు. ఈ కెమెరా 50 MP ప్రైమరీగా ఉండనుంది. అలాగే ఇందులో ఆల్ట్రా వైట్ లైన్స్, సెల్ఫీ కూడా అధిక మెగా పిక్సెల్ తో పనిచేస్తుంది. దీంతో ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ కోరుకునే వారికి ఇది అనుగుణంగా ఉంటుంది. ఇందులో 6000 mAh బ్యాటరీని ఉంచారు. ఈ బ్యాటరీ 33 Wired ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

ఇలాంటి ఫీచర్లో ఉన్న ఈ మొబైల్ ను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. 4 GB రామ్, 128 GB స్టోరేజ్ ఉన్న మొబైల్ ధర రూ.12,499 తో అందుబాటులో ఉండనుంది. ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ ను కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకు వచ్చిన POCO మొబైల్ కంటే ఇందులో అప్డేట్ ఫీచర్లు ఉండడంతో చాలామంది దీనిని కోరుకునే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అంతేకాకుండా మిడ్ రేంజ్ పీపుల్స్ కు అనుగుణంగా ఇందులో ఫీచర్లు ఉన్నాయని చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version