Sun Risers Hyderabad
Sun Risers : ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ చెరి ఐదు సార్లు విజయం సాధించాయి. హైదరాబాద్ జట్టు రెండుసార్లు ఛాంపియన్ అయింది. పలు సందర్భాల్లో ఫైనల్ వెళ్లినప్పటికీ ట్రోఫీ అందుకోలేకపోయింది. వాస్తవానికి ఎక్కువ విజయాలు సాధించిన జట్టుకు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంటుంది. కానీ హైదరాబాద్ విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధం. హైదరాబాద్ జట్టు ఓనర్ కావ్య మారన్ (kavya maran) కనిపిస్తే చాలు హైదరాబాద్ అభిమానులు ఆకాశానికి ఎగురుతారు. కావ్య కావ్య అంటూ నినాదాలు చేస్తారు. హైదరాబాద్ గెలిచినప్పుడు SRH అంటూ దిక్కులు పిక్కటిల్లే విధంగా అరుస్తున్నారు. అభిమానులు మాకు సాటి ఎవరూ లేరని నిరూపిస్తున్నారు. అందువల్లే హైదరాబాద్ జట్టు గత సీజన్ నుంచి తిరుగులేని ఆట తీరు ప్రదర్శిస్తోంది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు చేసిన జట్టుగా నిలిచింది. ఇక ఈ సీజన్లో ఆడిన తొలి మ్యాచ్ లోనే రాజస్థాన్ రాయల్స్ పై 286 పరుగులు చేసింది. సాధారణంగా ఐపీఎల్లో ఇంత స్కోర్ చేయాలంటే చాలా కష్టపడాలి. కానీ హైదరాబాద్ జట్టు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఈ స్కోర్ చేయగలిగింది. గత సీజన్లో ముంబై ఇండియన్స్, బెంగళూరు, లక్నో జట్లపై వీరవిహారం చేసింది. ఇప్పుడు ఈ సీజన్లో ఏకంగా 300 స్కోర్ మార్క్ పై కన్ను వేసింది. భవిష్యత్ కాలంలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో తెలియదు గానీ.. ఇప్పటికైతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతోంది. హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి వారు భీకరమైన ఫామ్ లో ఉన్నారు.. ప్రత్యర్థి జట్టు ఎలాంటి బౌలింగ్ వేసినా తుక్కు తుక్కు కొడుతున్నారు.. బౌలర్ల పై ఏమాత్రం కనికరం చెప్పకుండా ఆడుతున్నారు..
Also Read : లక్నో కాసుకో ఇక.. సన్ రైజర్స్ “300” కొట్టేస్తుందా?
సోషల్ మీడియాలో సంచలనం
సోషల్ మీడియాలో హైదరాబాద్ జట్టుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు సన్ రైజర్స్ హైదరాబాద్ ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేస్తుంది. ఇటీవల హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన ఫ్యాన్స్ మీట్లో హైదరాబాద్ కెప్టెన్ 3 వేళ్లుసంకేతాలుగా చూపించాడు. ఈ ఐపీఎల్ లో తమ జట్టు 300 స్కోర్ చేస్తుందని పరోక్షంగా చెప్పాడు. లక్నో జట్టుతో కొద్ది క్షణాల్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో బహుశా హైదరాబాద్ ఆ స్కోర్ చేస్తుందేమో.. ఇక హైదరాబాద్ జట్టుపై అభిమానాన్ని నెటిజన్లు రకరకాలుగా వ్యక్తం చేస్తున్నారు.. సోషల్ మీడియాలో కనిపిస్తున్న వీడియోలో హైదరాబాద్ జట్టుపై అభిమానులు చూపించిన ప్రేమ ఒక రేంజ్ లో కనిపిస్తోంది. దానికి కేజీఎఫ్ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ స్కోర్ యాడ్ కావడంతో మరింత ఎలివేట్ అయింది. మరికొద్ది క్షణాల్లో లక్నో జట్టుతో మ్యాచ్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ వీడియో ఇన్ స్టా గ్రామ్ లో దుమ్ము రేపుతోంది. ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ ద్వారా రూపొందించిన ఈ వీడియో సంచలనాలు సృష్టిస్తోంది. ఈ వీడియోలో హైదరాబాద్ అభిమానులు సన్ రైజర్స్ జెర్సీలు ధరించి అదిరిపోయే రేంజ్ లో డాన్సులు వేశారు. ఆరెంజ్ రంగులను చల్లుకుంటూ ఆకాశాన్ని అరుణ వర్ణ రంజితం చేశారు.
Also Read : ఉప్పల్ లో ఆడే ఒక్క మ్యాచ్ కు SRH ఎంత చెల్లిస్తుందో తెలుసా?