SRH Vs LSG 2025
SRH Vs LSG 2025: నువ్వా నేనా అన్నట్టుగా సాగిన మ్యాచులు ప్రేక్షకులకు సరికొత్త క్రికెట్ ఆనందాన్ని అందించాయి. కానీ ఎప్పుడూ “300” గురించి చర్చ జరగలేదు.. సన్ రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టు చేస్తున్న బ్యాటింగ్ వల్ల.. “300” పరుగులపై చర్చ జరుగుతున్నది. ఐపీఎల్ (IPL) లో “300” స్కోర్ చేసే సామర్థ్యం ఉన్న జట్లలో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు సన్ రైజర్స్ హైదరాబాద్ (Sun Risers Hyderabad). ఇటీవల రాజస్థాన్ రాయల్స్ జట్టుతో(SRH vs RR) జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ జట్టు దుమ్మురేపింది. ఏకంగా 286 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.. ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాళ్లు అదరగొట్టారు. ఇక గురువారం లక్నో సూపర్ జెయింట్స్(LSG) తో హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం లో జరిగే మ్యాచ్లో కమిన్స్ సేన దుమ్మురేపుడం పెద్ద కష్టం కాకపోవచ్చు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ దూకుడు మీద ఉన్న నేపథ్యంలో.. వీరిని ఎదుర్కోవడం లక్నో జట్టుకు ఇబ్బందే. రాజస్థాన్ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్(67), ఇషాన్ కిషన్(106*), నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ ఫామ్ చాటుకోవడం విశేషం. హైదరాబాద్ జట్టు ఇప్పుడు ఉన్న ఫామ్ ప్రకారం చూసుకుంటే.. టాస్ గెలిచిన జట్టు ఏదైనా ముందుగా బౌలింగ్ ఉంచుకోవడం సాహసమైన చెప్పాలి.. బౌలింగ్ విషయంలో కమిన్స్, మహమ్మద్ షమీ, హర్షల్ పటేల్, సమర్ జీత్ సింగ్ వంటి వారితో పేస్ బౌలింగ్ బలంగా కనిపిస్తోంది. అడం జంపా, అభిషేక్ శర్మ తో కూడా స్పిన్ బౌలింగ్ దళం బలంగానే ఉంది.
Also Read: అవి మొత్తం రిషబ్ పంత్ కు తెలుసు..
లక్నో జట్టు పరిస్థితి ఏంటంటే..
గత సీజన్లో లక్నో జట్టు పరవాలేదు అనే స్థాయిలోనే ప్రదర్శన చేసింది. గత మెగా వేలంలో రాహుల్ ను జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోలేదు. కొత్త కెప్టెన్ గా రిషబ్ పంత్ వచ్చాడు. ఇక ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు చేజేతులా ఓడింది. ఆర్చర్, ఫజల్ హాక్, సందీప్ శర్మ, తుషార్ దేశ్ పాండే, తీక్షణ వంటి బౌలర్ల బౌలింగ్ ను హైదరాబాద్ జట్టు ఊచకోత కోసింది. అలాంటప్పుడు లక్నో బౌలర్లు హైదరాబాద్ బ్యాటర్లను ఎంత మేరకు కట్టడం చేస్తారని చూడాలి. లక్నోలో శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణోయ్ కాకుండా మణి మారన్ సిద్ధార్థ్, దిగ్వేష్, ప్రిన్స్ యాదవ్, షాబాజ్ అహ్మద్ పెద్దగా సత్తా చూపించగల బౌలర్లు కాదు. అందువల్లే ఢిల్లీ తో జరిగిన మ్యాచ్లో విప్రజ్ నిగమ్, అశుతోష్ శర్మ దంచి కొట్టారు. పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ లక్నో జట్టు సొంతం. మార్క్రం, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, కెప్టెన్ రిషబ్ పంత్, డేవిడ్ మిల్లర్, ఆయుష్ బదోని, శాస్ వరకు బ్యాట్ తో సత్తా చాటగల ఆటగాళ్ళే. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతున్న నేపథ్యంలో.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు అడ్వాంటేజ్ కనిపిస్తోంది. గూగుల్ ప్రిడిక్షన్(Google prediction) ప్రకారం హైదరాబాద్ జట్టుకు 62, లక్నోకు 38 శాతం విజయవకాశాలున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్, లక్నో జట్లు ఐపీఎల్ లో నాలుగు సార్లు తలపడ్డాయి..హైదరాబాద్ ఒక్కసారి, లక్నో మూడు సార్లు విజయాలు సాధించాయి.