https://oktelugu.com/

Sikander Movie : నిరాశపరుస్తున్న ‘సికిందర్’ అడ్వాన్స్ బుకింగ్స్..సల్మాన్ ఖాన్ కు ఏమైంది?

Sikander Movie : ప్రతీ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా కళ్ళు చెదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. కేవలం ఓపెనింగ్స్ విషయంలోనే కాదు, లాంగ్ రన్ విషయం లో కూడా సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ రూలింగ్ అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. ఆయన డిజాస్టర్ ఫ్లాప్ చిత్రాలు సైతం మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయిల రేంజ్ లో నెట్ వసూళ్లను రాబట్టేవి. అలాంటి సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో ఆయన.

Written By: , Updated On : March 27, 2025 / 06:36 PM IST
Sikander Movie

Sikander Movie

Follow us on

Sikander Movie : ఇండియా లో బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ లిస్ట్ ఒకసారి తీస్తే అందులో సల్మాన్ ఖాన్(Salman Khan) పేరు ముందు వరుస లో ఉంటుంది. ఈయనకు ఉన్న బాక్స్ ఆఫీస్ స్టామినా ఎలాంటిదో తెలియని వాళ్లంటూ ఎవరుంటారు చెప్పండి. సుమారుగా 15 ఏళ్ళ పాటు ఓపెనింగ్స్ లో ఈయనకు పోటీని ఇచ్చిన మరో బాలీవుడ్ స్టార్ లేరంటే అతిశయోక్తి కాదేమో. చేసిన ప్రతీ సినిమాకు టాక్ తో సంబంధం లేకుండా కళ్ళు చెదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ వసూళ్లు వచ్చేవి. కేవలం ఓపెనింగ్స్ విషయంలోనే కాదు, లాంగ్ రన్ విషయం లో కూడా సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ రూలింగ్ అప్పట్లో మామూలుగా ఉండేది కాదు. ఆయన డిజాస్టర్ ఫ్లాప్ చిత్రాలు సైతం మూడు రోజుల్లో వంద కోట్ల రూపాయిల రేంజ్ లో నెట్ వసూళ్లను రాబట్టేవి. అలాంటి సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో ఆయన.

Also Read : ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్..ట్విస్ట్ అదిరింది కదూ!

కానీ ఏమైందో ఏమో తెలియదు, కరోనా లాక్ డౌన్ తర్వాత సల్మాన్ ఖాన్ బాక్స్ ఆఫీస్ స్టామినా చాలా వరకు తగ్గిపోయింది. సడన్ గా ఇలా ఎందుకు అయిపోయాడు అనేది ఆయన అభిమానులకు సైతం అంతు చిక్కని ప్రశ్న. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిన్న హీరోలు సైతం 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను మొదటి రోజు బాక్స్ ఆఫీస్ వద్ద అవలీలగా రాబట్టేస్తున్నారు. కానీ సల్మాన్ ఖాన్ లేటెస్ట్ చిత్రం ‘సికిందర్'(Sikindar Movie) కి కనీసం పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కూడా వచ్చే సూచనలు కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఆ రేంజ్ లో ఉన్నాయి మరి. ఈ నెల 30 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ అన్ని ఆన్లైన్ టికెట్ పోర్టల్స్ యాప్ లో ప్రారంభించారు. ముఖ్యంగా బుక్ మై షో లో బుకింగ్స్ మొదలై మూడు రోజులు కావొస్తుంది.

ప్రస్తుతానికి ఈ సినిమాకి గంటకు వెయ్యి టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోతున్నాయి. ఇది సల్మాన్ ఖాన్ రేంజ్ కి అవమానకరమైన ట్రెండింగ్. మూడు రోజులకు కలిపి బుక్ మై షో లో కనీసం 50 వేల టిక్కెట్లు కూడా బుక్ మై షో యాప్ లో అమ్ముడుపోలేదట. ఈ ట్రెండ్ ని చూసి సల్మాన్ ఫ్యాన్స్ చాలా తీవ్రమైన విచారణను వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల క్రితమే 30 కోట్ల రూపాయిల నెట్ వసూళ్ల ఓపెనింగ్ ని అవలీలగా రాబట్టిన సల్మాన్ ఖాన్ లాంటి హీరోకు, ఇప్పుడు పాతిక కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు కూడా వచ్చే సూచనలు రాకపోవడాన్ని చూస్తుంటే సల్మాన్ ఖాన్ మార్క్ రొటీన్ కమర్షియల్ సినిమాలకు ఇక కాలం చెల్లిపోయినట్టే, ఆయన నేటి తరం ఆడియన్స్ అభిరుచికి తగ్గట్టుగా తనని తానూ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. చూడాలి మరి ఈ చిత్రం ఆయన అభిమానులను ఎంతమేరకు అలరిస్తుంది అనేది.

Also Read : హరీష్ శంకర్ తో వెంకటేష్..మరి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పరిస్థితేంటి!