KL Rahul Athiya shetty blessed with baby girl
Star Cricketer : గత ఏడాది లక్నో జట్టుకు (LSG) కేఎల్ రాహుల్ (KL Rahul) నాయకత్వం వహించాడు. అయితే హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు అంతగా ప్రతిభను చూపించలేకపోయింది. హైదరాబాద్ జట్టును ఓడించలేకపోయింది. పైగా నాసిరకమైన ఆటతీరుతో పరువు పోగొట్టుకుంది. అదే సమయంలో స్టేడియంలో ఉండి మ్యాచ్ చూస్తున్న లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంక(Sanjeev goyanka) కేఎల్ రాహుల్ తో వాదనకు దిగాడు. జట్టు ఇలా ఎందుకు ఆడుతోందని మండిపడ్డాడు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటన తర్వాత కేఎల్ రాహుల్ మనసు తీవ్రంగా గాయపడింది. దీంతో ఆ సీజన్లో లక్నో జట్టుకు గుడ్ బై చెప్పేశాడు. అతడిని మెగా వేలంలో ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. వాస్తవానికి కేఎల్ రాహుల్ స్వస్థలం కర్ణాటక. అతడిని బెంగళూరు జట్టు కొనుగోలు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా ఢిల్లీ జట్టు కొనుగోలు చేసింది. ఢిల్లీ జట్టు యాజమాన్యం కెప్టెన్సీ ఆఫర్ చేసినప్పటికీ కేఎల్ రాహుల్ తిరస్కరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అతని బ్యాటింగ్ అద్భుతంగా ఉన్న నేపథ్యంలో.. బ్యాటింగ్ మీదనే దృష్టి సారిస్తానని.. కెప్టెన్సీ తీసుకోనని చెప్పేశాడు. దీంతో అక్షర్ పటేల్ కు ఢిల్లీ యాజమాన్యం కెప్టెన్సీ అప్పగించింది. ఇక కేఎల్ రాహుల్ ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా, ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుపై స్ఫూర్తిదాయకమైన ఆటతీరు ప్రదర్శించాడు. చివరి దాకా ఉండి జట్టును గెలిపించాడు.
Also Read : కట్టప్పలా చాహర్.. బాహుబలి లా ధోని.. వైరల్ వీడియో
తండ్రి అయ్యాడు
కేఎల్ రాహుల్ సోమవారం తండ్రి అయ్యాడు. అతని భార్య అతియ శెట్టి(athiya Shetty) పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది.. ప్రస్తుతం తల్లి కూతురు క్షేమంగా ఉన్నారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో కె.ఎల్ రాహుల్ పంచుకున్నాడు..” ఆడపిల్ల పుట్టింది.. సంతోషంగా ఉంది.. రాహుల్ – అతియ” అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశాడు. ప్రస్తుతం లక్నో జట్టుతో ఢిల్లీ క్యాపిటల్స్ లీగ్ మ్యాచ్ ఆడుతోంది. ఢిల్లీ జట్టుకు కేఎల్ రాహుల్ ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.అతియ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చిన నేపథ్యంలో.. లక్నో జట్టుతో జరుగుతున్న మ్యాచ్ కు కెఎల్ రాహుల్ గైర్హాజరయ్యాడు. భార్య ప్రసవించిన నేపథ్యంలో.. ఆమె వెంటే ఉన్నాడు. అతియ శెట్టి బాలీవుడ్ లోని ప్రముఖ నటుడు సునీల్ శెట్టి(Sunil Shetty) కూతురు. అతియ, కె.ఎల్ రాహుల్ చాలా సంవత్సరాలుగా ప్రేమించుకున్నారు. ఏడాదిన్నర క్రితం వివాహం చేస్తున్నారు. ప్రస్తుతం అతియ పండంటి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇటీవల కేఎల్ రాహుల్, అతియ బేబీ బంప్ ఫోటోలు దిగారు. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అవి వైరల్ గా మారాయి . పండంటి ఆడ శిశువు పుట్టిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల వేదికగా కేఎల్ రాహుల్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read : నిన్న ఇర్ఫాన్ పఠాన్.. నేడు హర్భజన్ సింగ్.. మెదడు అరికాళ్ళలో ఉందా?