Deepak Chahar sledges MS Dhoni
MS Dhoni : సుదీర్ఘకాలం క్రికెట్ ఆడినప్పటికీ మహీంద్ర సింగ్ ధోని(Mahindra Singh Dhoni) కి మైదానంలో ఎక్కువగా స్నేహితులు లేరు.. సురేష్ రైనా, విరాట్ కోహ్లీ వంటి వారితో మాత్రమే ధోని సన్నిహితంగా ఉంటాడు. అయితే తాజాగా దీపక్ చాహర్ (Deepak chahar) కూడా ధోనికి సన్నిహితుడని తెలుస్తోంది. ఆదివారం ఈ విషయం క్రికెట్ ప్రపంచానికి తెలిసింది. దీపక్ చాహర్ ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్నాడు. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆదివారం చెన్నైలోని చెపాక్ స్టేడియంలో లీగ్ మ్యాచ్ ఆడాయి. ఈ మ్యాచ్లో చెన్నై జట్టు విజయం సాధించింది. ఉత్కంఠ మధ్య జరిగిన ఈ మ్యాచ్లో చెన్నై జట్టు చివరి వరకు పోరాడి.. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. తద్వారా గత రెండు సీజన్లుగా ముంబై జట్టుపై తన ఆధిపత్యాన్ని చెన్నై సూపర్ కింగ్స్ ప్రదర్శించింది. ఈ మ్యాచ్ అనంతరం చెన్నై ఆటగాళ్లను ముంబై జట్టు ఆటగాళ్లు అభినందించారు. ఈ సమయంలో దీపక్ ను ధోని ఆట పట్టించాడు.
Also Read : నిన్న ఇర్ఫాన్ పఠాన్.. నేడు హర్భజన్ సింగ్.. మెదడు అరికాళ్ళలో ఉందా?
2018 నుంచి..
2018 నుంచి దీపక్ చాహర్ చెన్నై జట్టుకు ఆడుతున్నాడు. తన ప్రతిభ వల్ల భారత జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో అతడు తరచుగా గాయపడటంతో కెరియర్ సంఘటనలో పడింది. గత ఏడాది జరిగిన మెగా వేలంలో చెన్నై జట్టు దీపక్ చాహర్ ను రిటైన్ చేసుకోలేదు. అయితే వేలంలో ముంబై జట్టు దీపక్ ను 9.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆరు సంవత్సరాలపాటు చెన్నై జట్టుకు దీప ఆడిన నేపథ్యంలో.. ఆ జట్టు యాజమాన్యం రిటైన్ చేసుకోకపోవడంతో ఆ బంధానికి వీడ్కోలు పలికాడు. ఇక ముంబై జట్టు తరుపున ఆడిన దీపక్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. బ్యాట్ ద్వారా 15 బంతుల్లో 28 పరుగులు చేశాడు. బౌలింగ్లో రెండు ఓవర్లు వేసి, పద్ధతి పరుగులు ఇచ్చి ఒక వికెట్ సాధించాడు. ఇక ముంబై – చెన్నై మ్యాచ్ లో దీపక్ చాహర్ ను ధోని సరదాగా ఆట పట్టించాడు. ఈ సన్నివేశాన్ని బాహుబలి సినిమాతో పోల్చారు దీపక్ సోదరి . చెన్నై జట్టు ఆటగాలను అభినందించడానికి ముంబై ఆటగాళ్లు వచ్చినప్పుడు.. ధోని దీపక్ ను సరదాగా ఆట పట్టించాడు. ఆ సమయంలో దీపక్ బాహుబలిలో ప్రభాస్ లాగా ముందు ఉంటే.. ధోని కట్టప్ప లాగా ఉన్నాడు. బాహుబలి సినిమాలో ప్రభాస్ ను కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. ఇక ఆదివారం మ్యాచ్లో ధోని చివర్లో వచ్చాడు. రెండు బంతులు ఆడాడు. ఒక్క పరుగు కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలో ధోనిపై దీపక్ తనదైన వ్యాఖ్యలు చేశాడు..” నీకు అత్యంత సమీపంలో ఫీల్డింగ్ చేస్తా.. ధోని ధోని” అంటూ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ వ్యాఖ్యలు చేసిన దీపక్ ను ధోని ఆటపట్టించాడు. తనను ఆటపట్టించిన దీపక్ ను బ్యాట్ తో కొట్టినట్టు ధోని నవ్వించే ప్రయత్నం చేశాడు.
Also Read : ముంబై ఇండియన్స్ కు ఏంటీ దరిద్రం.. రోహిత్ ఇంత దారుణమా?
MS Dhoni giving BAT treatment to Deepak Chaharpic.twitter.com/2uYGLkFdpy
— ` (@lofteddrive45) March 23, 2025