Rishabh Pant
Rishabh Pant : ఐపీఎల్ లీగ్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం స్టేడియంలో సోమవారం లక్నో (LSG) , ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi capitals) మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టు కెప్టెన్ అక్షర్ పటేల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో జట్టు ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. లక్నో జట్టులో పూరన్(75), మార్ష్(72) విధ్వంసాన్ని సృష్టించారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (27) సుడిగాలి ఇన్నింగ్స్ ఆడటంతో లక్నో జట్టు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడి 8 వికెట్లు నష్టానికి 209 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో మిచెల్ స్టార్క్(Mitchell starc) మూడు వికెట్లు పడగొట్టాడు. కులదీప్ యాదవ్ (Kuldeep Yadav) రెండు వికెట్లు సాధించాడు.
Also Read :కట్టప్పలా చాహర్.. బాహుబలి లా ధోని.. వైరల్ వీడియో
27 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే..
గత ఏడాది జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ (Rishabh pant) నిలిచాడు. గత సీజన్లో ఇతడు ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. అయితే మెగా వేలంలో ఢిల్లీ యాజమాన్యం ఇతడిని రిటైన్ చేసుకోవడానికి లేదా కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపించలేదు. దీంతో లక్నో జట్టు రిషబ్ పంత్ ను కొనుగోలు చేసింది. మెగా వేలంలో అప్పటిదాకా లక్నో జట్టుకు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ను రిటైన్ లేదా కొనుగోలు చేయడానికి లక్నో యాజమాన్యం ఆసక్తి చూపించలేదు. దీంతో లక్నో జట్టుకు కెప్టెన్ కావాల్సి వచ్చింది. ఫలితంగా మెగా వేలంలో అందుబాటులో ఉన్న పంత్ ను 27 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపిఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు. గత సీజన్లో ఢిల్లీ జట్టు కెప్టెన్ గా అతడు రాణించాడు. దీనిని దృష్టిలో పెట్టుకొని లక్నో జట్టు యాజమాన్యం అతడిని కొనుగోలు చేసింది. అని అతడు మాత్రం అంతగా రాణించలేకపోయాడు. తొలి మ్యాచ్లో రెండు బంతులు ఎదుర్కొన్న అతడు 0 పరుగులకే అవుట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్ లో అతడు క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో నెట్టింట రిషబ్ పంత్ పై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ” 27 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే ఇలానేనా ఆడేది.. గత సీజన్లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయినందుకు లక్నో యజమాని సంజీవ్ అప్పటి కెప్టెన్ కేఎల్ రాహుల్ పై మండిపడ్డాడు. మరి ఇప్పుడు 27 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన నిన్ను ఎలాంటి మాటలు అంటాడో ఊహించుకుంటేనే భయం వేస్తోందని” పంత్ అభిమానులు సోషల్ మీడియా వేదిక వ్యాఖ్యానిస్తున్నారు
Also Read :చెన్నై బౌలర్ బాల్ ట్యాంపరింగ్..MI పై అందుకే గెలిచిందా?
Sanjiv Goenka to rishabh pant #DCvsLSG pic.twitter.com/aTXQBRVzim
— chacha (@meme_kalakar) March 24, 2025