https://oktelugu.com/

Harbhajan Singh: నిన్న ఇర్ఫాన్ పఠాన్.. నేడు హర్భజన్ సింగ్.. మెదడు అరికాళ్ళలో ఉందా?

Harbhajan Singh : ఆట అందలం ఎక్కిస్తుంది. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు ఎర్ర తివాచీ పరుస్తుంది. ఇలాంటి ప్రతిభ ఉన్న ఆటగాళ్లు మనదేశంలో ఎంతో మంది ఉన్నారు.

Written By: , Updated On : March 24, 2025 / 09:19 PM IST
Harbhajan Singh

Harbhajan Singh

Follow us on

Harbhajan Singh : మనదేశంలో క్రికెట్ (Indian cricket) కు క్రేజ్ ఎక్కువ. ప్రపంచంలో చాలా దేశాలు క్రికెట్ ఆడుతున్నప్పటికీ.. క్రికెట్ మీద పెత్తనం సాగిస్తున్న బోర్డు మాత్రం బిసిసిఐ(BCCI) అనడంలో ఎటువంటి సందేహం లేదు.. అదే అటువంటి దేశంలో కొంతమంది మాజీ ఆటగాళ్లు చేస్తున్న వ్యాఖ్యలు వెగటు పుట్టిస్తున్నాయి. క్రికెట్ ను ఆరాధించే దేశంలో ఆటగాళ్లు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి భారత క్రికెట్ అభిమానులు ఏ మాత్రం సహించలేకపోతున్నారు. ఇటీవల టీమిండియా మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) టీమిడియాలోని ఆటగాళ్లపై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ను లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశాడు. ఇవి కాస్త రోహిత్ శర్మను నొప్పించాయి. దీంతో అతడు ఈ విషయాన్ని బీసీసీఐ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారు కఠిన చర్యలకు ఉపక్రమించారు. ఫలితంగా ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో కామెంట్రీ ప్యానల్ నుంచి అతడిని తొలగించారు. దీంతో ఇర్ఫాన్ పఠాన్ సొంతంగా యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేసుకున్నాడు.. “సీది బాత్ విత్ ఇర్ఫాన్ పఠాన్” అని దానికి పేరు పెట్టాడు.. ఇర్ఫాన్ పఠాన్ చేసిన వ్యాఖ్యల పట్ల రోహిత్ అభిమానులు తీవ్రంగా మండిపడ్డారు. ఒక సీనియర్ ఆటగాడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల విచారం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఈ జాబితాలోకి హర్భజన్ సింగ్ చేరాడు.

Also Read : ముంబై ఇండియన్స్ కు ఏంటీ దరిద్రం.. రోహిత్ ఇంత దారుణమా?

నల్ల టాక్సి అంటూ..

టీమిండియాలో హర్భజన్ సింగ్ అద్భుతమైన ఆటగాడు. సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం అతడు టీమిండియాలో కీలక బౌలర్ గా ఒక వెలుగు వెలిగాడు. టీం ఇండియా సాధించిన విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు. పైగా అతడు జాత్యాహంకార బాధితుడు కూడా. ఒకసారి ఆస్ట్రేలియా టూర్ కి వెళ్ళినప్పుడు.. ఆండ్రూ సైమండ్స్, హర్భజన్ సింగ్ మధ్య మంకీ గేట్ వివాదం ఏర్పడింది. అది కాస్త పెను దుమారానికి దారి తీసింది. ఆ ఘటనలో హర్భజన్ సింగ్ కన్నీరు పెట్టుకున్నాడు. అలాంటి నేపథ్యం ఉన్న బౌలర్ నోరు మీద అదుపు కోల్పోయాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో రాజస్థాన్ జట్టు తరఫున ఆడుతున్న జోప్రా ఆర్చర్ (jofra Archer) పై తిక్క వ్యాఖ్యలు చేశాడు..” లండన్ లో నల్ల టాక్సీ మీటర్ తరహాలోనే.. ఆర్చర్ మీటర్ కూడా పెరుగుతుందని” అభివర్ణించాడు. దీనిపై క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు..ఓ ఆటగాడికి ఎలాంటి గౌరవం ఇవ్వాలో తెలియదా అంటూ మండిపడుతున్నారు. హర్భజన్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం లేపడంతో ఐపీఎల్ నిర్వాహక కమిటీ నష్ట నివారణ చర్యలకు దిగింది. వెంటనే హర్భజన్ సింగ్ వివరణ కోరినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. మరోవైపు తలతిక్క వ్యాఖ్యలు చేసిన హర్భజన్ సింగ్ ను కామెంట్రీ ప్యానెల్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.. మరి దీనిపై హర్భజన్ సింగ్ ఎలాంటి వ్యాఖ్యలు చేస్తాడో చూడాల్సి ఉంది.

Also Read : ఐపీఎల్ లో ఈ రికార్డులు బద్దలు కొడితే వీరే టాప్..