Homeక్రీడలుక్రికెట్‌Sanju Samson mother emotional reaction: సంజు శాంసన్ వీరోచిత బ్యాటింగ్..అతడి తల్లి ఏం చేసిందో...

Sanju Samson mother emotional reaction: సంజు శాంసన్ వీరోచిత బ్యాటింగ్..అతడి తల్లి ఏం చేసిందో తెలుసా?

Sanju Samson mother emotional reaction: 2022, 2024 తర్వాత.. 2026లో కూడా టీమిండియా టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ చేరుకుంది. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుతో పోటీ పడనుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబై వేదికగా జరగనుంది. 2011లో ముంబై వేదికగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. నాటి మ్యాచ్లో టీమ్ ఇండియా శ్రీలంక మీద విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. ముంబై టీమిండియాకు అచ్చొచ్చిన వేదిక. అందువల్లే ఈ మైదానంలో టీమిండియా […]

Sanju Samson mother emotional reaction: 2022, 2024 తర్వాత.. 2026లో కూడా టీమిండియా టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ చేరుకుంది. సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్టుతో పోటీ పడనుంది. సెమీ ఫైనల్ మ్యాచ్ ముంబై వేదికగా జరగనుంది.

2011లో ముంబై వేదికగా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ జరిగింది. నాటి మ్యాచ్లో టీమ్ ఇండియా శ్రీలంక మీద విజయం సాధించి ట్రోఫీని అందుకుంది. ముంబై టీమిండియాకు అచ్చొచ్చిన వేదిక. అందువల్లే ఈ మైదానంలో టీమిండియా ఎప్పుడు మ్యాచ్ ఆడినా సరే అభిమానులు భారీగా హాజరవుతుంటారు. టీమ్ ఇండియా ప్లేయర్లకు తమ సపోర్టు అందిస్తూ ఉంటారు.

వాస్తవానికి సూపర్ 8 లో టీమిండియా భారీ వ్యత్యాసంతో దక్షిణాఫ్రికా చేతిలో ఓడిపోయింది. ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా సూపర్ 8 లో మిగతా రెండు మ్యాచులు గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో జింబాబ్వే, వెస్టిండీస్ జట్లతో జరిగిన మ్యాచ్లలో టీమిండియా వరుస విజయాలు సాధించింది. తద్వారా సెమి ఫైనల్లోకి వెళ్లిపోయింది.

జింబాబ్వే జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియాలో అందరు ప్లేయర్లు సత్తా చూపించారు. కానీ వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం అభిషేక్ శర్మ విఫలమయ్యాడు. ఇషాన్ కిషన్ చేతులెత్తేశాడు. సూర్య కుమార్ యాదవ్ తన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయాడు. మరో ఓపెనర్ సంజు శాంసన్ సత్తా చూపించాడు. ప్రారంభం నుంచి చివరి వరకు మైదానాన్ని వీడి వెళ్లిపోలేదు. నిర్లక్ష్యమైన షాట్ లు ఆడి వికెట్ పారేసుకోలేదు. అన్ని విధాలుగా వెస్టిండీస్ జట్టు మీద తన ఆధిపత్యాన్ని కొనసాగించాడు.

సంజు శాంసన్ 97 పరుగులు చేయడంతో.. అతడి మాతృమూర్తి సంబరాలు చేసుకుంది. టీవీలో తన కొడుకు బ్యాటింగ్ చేస్తున్న తీరును చూసి డ్యాన్స్ చేసింది. ” తమ కడుపులో పుట్టిన వారు గొప్ప స్థానాలను అందుకుంటే వారిని కన్నవారికి గొప్పగా ఉంటుంది. సంజు కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టును గెలిపించడంతో.. అతడి తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఎందుకంటే కొంతకాలంగా సంజు కు జట్టులో స్థిరమైన స్థానం లేకుండా పోతుంది. ఈ నేపథ్యంలో అతడు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. టీమ్ ఇండియా గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు . ఇంతకంటే గొప్ప సందర్భం ఏముంటుంది.. ఇంతకంటే ఆనందం ఇంకొకటి ఏమంటుందని” సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper