Homeఅంతర్జాతీయంIran targets Gulf countries: గల్ఫ్‌ దేశాలను టార్గెట్‌ చేసిన ఇరాన్‌.. కారణం ఇదే!

Iran targets Gulf countries: గల్ఫ్‌ దేశాలను టార్గెట్‌ చేసిన ఇరాన్‌.. కారణం ఇదే!

Iran targets Gulf countries: ఇరాన్‌ అణు కార్యాకలాపాలు కొనసాగిస్తోందన్న కారణంతో అమెరికా ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధం ప్రారంభించింది. ఇప్పటికే దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మరణించారు. దీంతో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా ఎన్నడూ చూడని యుద్ధం చూపిస్తామని హెచ్చరించింది. చెప్పినట్లుగానే ఇరాన్‌ మిసైళ్లు, డ్రోన్లతో గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఎంబసీలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చింది. ఖతార్‌లోని అమెరికా ఎంబసీపై దాడిచేసింది. దుబాయ్‌లోని హోటల్‌పై దాడి […]

Iran targets Gulf countries: ఇరాన్‌ అణు కార్యాకలాపాలు కొనసాగిస్తోందన్న కారణంతో అమెరికా ఇజ్రాయెల్‌తో కలిసి యుద్ధం ప్రారంభించింది. ఇప్పటికే దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ ఖమేనీ మరణించారు. దీంతో ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్‌ ప్రకటించింది. అమెరికా ఎన్నడూ చూడని యుద్ధం చూపిస్తామని హెచ్చరించింది. చెప్పినట్లుగానే ఇరాన్‌ మిసైళ్లు, డ్రోన్లతో గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా స్థావరాలు, ఎంబసీలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే అమెరికాకు చెందిన యుద్ధ విమానాలను కూల్చింది. ఖతార్‌లోని అమెరికా ఎంబసీపై దాడిచేసింది. దుబాయ్‌లోని హోటల్‌పై దాడి చేసింది. దుబాయ్, ఖతార్, యూఏఈ వంటి గల్ఫ్‌ దేశాలను లక్ష్యంగా చేసుకుంటోంది.

ఇరాన్‌ పరోక్ష లక్ష్యాలు
అమెరికాపై నేరుగా దాడిచేసే సామర్థ్యం లేకపోవడంతో ఇరాన్‌ సౌదీ, యూఏఈ, ఖతార్‌లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తూ అరబ్‌ దేశాల్లో భావోద్వేగాలను రేకెత్తిస్తోంది. ఇది ‘మన బాధ అందరికీ తెలియాలి‘ అనే సందేశం, గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ అండగా నిలబడాలని ఒత్తిడి. హోటల్స్, వాణిజ్య కేంద్రాలపై దాడులు సివిలియన్‌ లక్ష్యాలను సూచిస్తున్నాయి.

పాఠశాలపై అమెరికా దాడి..
అమెరికా ఇరాన్‌ పాఠశాలలపై దాడి చేసినా ‘ఆయుధం గురితప్పింది‘ అని చెప్పడం అసాధారణం, ఎందుకంటే వేలాది కిలోమీటర్ల దూరాల్లో కచ్చిత లక్ష్యాలను చేసే సామర్థ్యం దానిది. ఇరాన్‌ ఆయుధాలు గురితప్పడం సహజం, కానీ అమెరికా వైఫల్యం వివాదాస్పదం.

ప్రాంతీయ ఐక్యత..
గల్ఫ్‌ దేశాలు ఇరాన్‌ దాడులతో ఐక్యంగా స్పందిస్తున్నాయి, అమెరికా మద్దతు పొందుతున్నాయి. ఇది ప్రాంతీయ యుద్ధానికి దారితీసే ప్రమాదం, ఆయిల్‌ సరఫరాలు, ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తుంది. ఇరాన్‌ వ్యూహం తాత్కాలిక లాభం ఇస్తుంది కానీ దీర్ఘకాలంలో గల్ఫ్‌ ఐక్యతను బలోపేతం చేస్తుంది.

 

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper