Sunil Gavaskar : లక్నో, ఢిల్లీ (DC vs LSG) తలపడిన.. మ్యాచ్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. చివరి వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్లో ఢిల్లీ ఆటగాడు అశుతోష్ వర్మ (Ashutosh Varma) భారీ సిక్సర్ కొట్టి మ్యాచ్ గెలిపించాడు. వాస్తవానికి ఈ మ్యాచ్లో లక్నో జట్టు గెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఢిల్లీ జట్టు చివరి వరకు పోరాడి విజయాన్ని సొంతం చేసుకోండి. లక్నో జట్టు ఓడిపోయిన తర్వాత కెప్టెన్ రిషబ్ పంత్ (Lucknow team captain Rishabh pant) , లక్నో జట్టు యజమా సంజీవ్ గోయెంకా (Lucknow super giants owner Sanjeev goyanka) మధ్య సంభాషణ జరిగింది. అది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. గత సీజన్లో లక్నో జట్టుపై హైదరాబాద్ గెలిచినప్పుడు కే ఎల్ రాహుల్ – సంజీవ్ గోయెంకా ఇలానే మాట్లాడారని సోషల్ మీడియాలో మీమ్స్ ప్రవాహం సాగింది. అయితే డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిన సంజీవ్ ఆటగాళ్లకు ధైర్యం చెప్పాడు. ఫలితంగా వారిద్ర మధ్య ఎటువంటి వివాదం చోటు చేసుకోలేదని తెలుస్తోంది. అయితే లక్నో జట్టు కోచ్ క్లూసెనర్ రిషబ్ పంత్ తో విభజించినట్టు సమాచారం.. అయితే ఈ వ్యవహారంపై టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) సంచలన వ్యాఖ్యలు చేశాడు.
Also Read : శ్రేయస్ అయ్యర్.. త్యాగంలో శిబి చక్రవర్తిని మించిపోయావ్..
ఏం జరిగిందంటే..
” మ్యాచ్ లో ఎటువంటి పొరబాట్లు జరిగాయో పంత్ కు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఓటముల నుంచి పాటలు నేర్చుకోవాలి. మెరుగ్గా ఆడినప్పుడు మెరుగ్గా ఆడినప్పుడు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఏదైనా అంశంలో విఫలమైతే అన్ని లోపాలే కనిపిస్తాయి. అప్పుడు ఎక్కడ లోపం జరిగిందో.. దానిని పరిష్కరించుకున్నందుకు ప్రయత్నం చేయాలి. లక్నో జట్టు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడింది. ఇక 13 మ్యాచులు ఆడాలి. పంత్ తెలివైన ఆటగాడు కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. అతని బ్యాటింగ్ బాగుంటుంది.. కెప్టెన్సీ గురించి కొంత అతడు తెలుసుకోవాల్సి ఉంది. వచ్చే రోజుల్లో అతడు వాటిని పాటిస్తాడు. నాణ్యమైన ఆట తీరు కొనసాగిస్తాడు.. కెప్టెన్ గా ఉన్న ఆటగాడు పరుగులు లేదా వికెట్లు తీసినప్పుడు మాత్రమే సహచర ఆటగాళ్లకు ఆదర్శంగా ఉంటాడు.. పంత్ కనుక అద్భుతంగా బ్యాటింగ్ చేయడం మొదలుపెడితే నాయకత్వం వహించడం పెద్ద కష్టం కాదు. గత సీజన్ లో ఢిల్లీ జట్టుకు పంత్ నాయకత్వం వహించాడు. అద్భుతంగా బ్యాటింగ్ చేసి.. జట్టుకు తన వంతుగా విజయాలు అందించాడు. ఇప్పుడు కూడా అంతకుమించి జోరు చూపిస్తాడని అనుకుంటున్నాను.. పంత్ తనదైన నాయకత్వ ప్రతిభను ప్రదర్శిస్తాడని భావిస్తున్నానని” సునీల్ గవాస్కర్ పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు..
Also Read : మ్యాచ్ లో మాత్రమే ప్రత్యర్థులు.. ఆ తర్వాత స్నేహితులు.. వీడియో వైరల్