https://oktelugu.com/

Ram Charan : ‘పుష్ప’ లుక్ ని తలపించిన రామ్ చరణ్ ‘పెద్ది’ ఫస్ట్ లుక్ పోస్టర్!

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram charan) పుట్టినరోజు సందర్భంగా ఆయన డైరెక్టర్ బుచ్చి బాబు(Buchibabu Sana) తో కలిసి చేస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు.

Written By: , Updated On : March 27, 2025 / 10:30 AM IST
Ram Charan

Ram Charan

Follow us on

Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global star Ram charan) పుట్టినరోజు సందర్భంగా ఆయన డైరెక్టర్ బుచ్చి బాబు(Buchibabu Sana) తో కలిసి చేస్తున్న చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ని కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఈ చిత్రానికి ముందు నుండి సోషల్ మీడియా లో ఉన్న ప్రచారం ని నిజం చేస్తూ ‘పెద్ది'(Peddi Movie) టైటిల్ ని ఖరారు చేసారు. మారుమూల గ్రామం లో ఉన్న ఒక కుర్రాడు, అన్ని రకాల ఆటల్లో ఆరితేరి ఉంటాడు. కానీ అతని ప్రతిభ ని ఎవ్వరూ గుర్తించరు. గుర్తింపు కోసం నిరంతరం పోరాటం చేసే ఆ కుర్రాడు, అనుకున్నది సాధించాడా లేదా అనేదే స్టోరీ. ఈ సినిమా ఫస్ట్ లుక్ కి సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యింది. కానీ రామ్ చరణ్ పెద్ద మాస్ హీరో కాబట్టి, ఆయనకు అభిమానులు ఏ రేంజ్ లో ఉంటారో, దురాభిమానుల కూడా అదే రేంజ్ లో ఉంటారు.

Also Read : నోట్లో బీడి రగ్గుడ్ లుక్ తో రామ్ చరణ్ రఫ్ఫాడించాడుగా…

అందుకే ఈ సినిమా పై ట్రోల్స్ కూడా బలంగానే వచ్చాయి. ముఖ్యంగా సోషల్ మీడియా లో రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్(Icon star Allu Arjun) అభిమానుల మధ్య ఫ్యాన్ వార్స్ ఏ రేంజ్ లో జరుగుతాయో మన అందరం గత కొంతకాలంగా చూస్తూనే ఉన్నాం. ఈ సినిమా ఫస్ట్ లుక్ గురించి కూడా అలాంటి ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయి. ఈ ఫస్ట్(Pushpa) లుక్ పుష్ప ఫస్ట్ లుక్ తో పోలి ఉందని, రెండు పోస్టర్స్ ని విడుదల చేస్తే ఒక పోస్టర్ పుష్ప స్టైల్ లో ఉండగా, మరో పోస్టర్ KGF స్టైల్ లో ఉందని అంటున్నారు. చూస్తే వాళ్ళు చెప్పిన దాంట్లో కూడా లాజిక్ ఉంది కదా అని అనిపిస్తుంది. చుట్టని వెలిగించే పోస్టర్ ని చూస్తే మనకు తక్కువమని పుష్ప ఫస్ట్ లుక్ గుర్తుకు వస్తుంది. ఎక్స్ ప్రెషన్స్ కూడా అదే రేంజ్ లో ఉన్నాయి. అది యాదృచ్చికంగా జరిగి ఉండొచ్చు కానీ, రెండు పోస్టర్స్ ని పోల్చుకునే విధంగానే ఉన్నాయి.

అదే విధంగా పెద్ది టైటిల్ మీద కూడా పెద్ద రచ్చ జరుగుతుంది. గతం లో బుచ్చి బాబు ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయాలనీ అనుకున్నడు. ఆ చిత్రానికి పెద్ది అనే టైటిల్ అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ ఎందుకో ఎన్టీఆర్ ఈ సినిమాని వదిలేసుకోవాల్సి వచ్చింది. ఆ సినిమానే ఇప్పుడు రామ్ చరణ్ చేస్తున్నాడని, ఇది మా వాడు మీకు దానం చేసిన సినిమా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. ట్రోల్స్ సంగతి పక్కన పెడితే మామూలు ఆడియన్స్ నుండి మాత్రం ఈ సినిమా ఫస్ట్ లుక్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. పర్ఫెక్ట్ గా అనుకున్నది అనుకున్నట్టుగా తీస్తే కచ్చితంగా ఈ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో ఇండస్ట్రీ గా నిలిచే అవకాశాలు ఉన్నాయి.

Also Read : రామ్ చరణ్ బర్త్ డే కి రచ్చ రచ్చ చేయనున్న అభిమానులు…