SRH vs KKR
SRH vs KKR : గత సీజన్లో హైదరాబాద్ జట్టు ఫైనల్ వెళ్ళింది. హోరాహోరిగా సాగిన అన్ని మ్యాచ్లలో హైదరాబాద్ బౌలర్లు సత్తా చూపించారు. ముంబై, బెంగళూరు, రాజస్థాన్, పంజాబ్.. ఇలా మేటి జట్లపై హైదరాబాద్ బ్యాటర్లే కాదు.. బౌలర్లు కూడా తమ ప్రతాపాన్ని చూపించారు.ఇలాగే ఫైనల్ దాకా వెళ్లారు. కానీ ఫైనల్ మ్యాచ్లో కోల్ కతా చేతిలో సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోయింది. గత సీజన్లో హైదరాబాద్ బౌలింగ్ మెరుగ్గా ఉంది. బౌలర్లు పదునైన బంతులు వేసి.. వికెట్లు పడగొట్టారు. అంతేకాదు బ్యాటర్లు చేతులెత్తేసిన మ్యాచ్లలో అద్భుతంగా బౌలింగ్ వేసి గెలిపించారు.. కానీ ఈ సీజన్లో హైదరాబాద్ బౌలింగ్ అంత గొప్పగా లేదు. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ హైదరాబాద్ బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. స్కోర్ భారీగా ఉండటంవల్ల హైదరాబాద్ గెలిచింది గాని.. లేనిపక్షంలో ఆ మ్యాచ్ కూడా ఓడిపోయి ఉండేది.. గురువారం హైదరాబాద్ ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్ కతా జట్టుతో తలపడుతోంది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో జాతీయ మీడియాలో వస్తున్న కథనాలు హైదరాబాద్ బౌలింగ్లో బేలతనాన్ని సూచిస్తున్నాయి.
Also Read : కోల్ కతా పై గెలిస్తేనే.. పరువు దక్కేది..SRH ఏం చేస్తుందో?
చెత్త బౌలింగ్
సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ సగటు ఈ సీజన్లో 37.54 గా నమోదయింది. ఎకనామి రేటు కూడా 9.89గా ఉంది. ఐపీఎల్ 2024లో ఢిల్లీ క్యాపిటల్స్ ఎకనామీ రేటును 9.95 గా నమోదు చేసింది. ఢిల్లీ కంటే 0.4 శాతం మాత్రమే హైదరాబాద్ బౌలింగ్ ఈ సీజన్లో మెరుగ్గా ఉంది.. ఇక ఢిల్లీ బౌలింగ్ ఈ సీజన్లోనూ దారుణంగానే ఉంది.. హైదరాబాద్ జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే సత్తాను కలిగి ఉన్నారు. కానీ అలాంటి బౌలర్లు ఇంత దారుణంగా బౌలింగ్ చేయడానికి సగటు హైదరాబాద్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇప్పటివరకు ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు మూడు మ్యాచ్లు ఆడింది.. తొలి మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడింది. ముందుగా బ్యాటింగ్ చేసి 286 రన్స్ చేసింది. ఆ తర్వాత రాజస్థాన్ జట్టు ఆరు వికెట్ల నష్టానికి 242 రన్స్ చేసింది. లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 190 పరుగులు చేయగా.. లక్నో జట్టు ఆ టార్గెట్ ను 16.1 ఓవర్లలోనే ఐదు వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది.. ఇక మూడో మ్యాచ్లో ఢిల్లీ చేతిలో 163 పరుగులకు కుప్ప కూలింది. ఆ తర్వాత ఢిల్లీ జట్టు కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేదించింది. ఆడిన మూడు మ్యాచ్లలో రెండిట్లో హైదరాబాద్ బ్యాటర్లు ఆల్ అవుట్ అయ్యారు. కానీ హైదరాబాద్ బౌలర్లు ప్రత్యర్థులను ఆలౌట్ చేయలేకపోయారు..
Also Read : SRH ఆంధ్రా కు తరలిపోనుందా?