SRH vs KKR : ఈ సీజన్లో కోల్ కతా నైట్ రైడర్స్ మూడు మ్యాచ్ లు ఆడి రెండిట్లో ఓడిపోయింది.. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి కూడా అలానే ఉంది.. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలిచిన హైదరాబాద్.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్, జట్లతో జరిగిన మ్యాచ్లో ఓడిపోయింది. పాయింట్లు పట్టికలో కోల్ కతా నైట్ రైడర్స్ అక్కడు స్థానంలో ఉంది..సన్ రైజర్స్ హైదరాబాద్ 8వ స్థానంలో కొనసాగుతోంది. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ మధ్య మ్యాచ్ జరగనుంది.
లో స్కోరింగ్ కు అవకాశం
ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఆ మ్యాచ్లో కోల్ కతా నైట్ రైడర్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బెంగళూరు మూడు వికెట్లు కోల్పోయి చేదించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఈ సీజన్లో ఈ వేదికపై కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆడుతున్న రెండో మ్యాచ్ ఇది. పిచ్ పరిస్థితిని చూస్తే మందకొడిగా కనిపిస్తోంది. లో స్కోర్ నమోదయ్యే అవకాశం ఉందని సమాచారం.. ఒక రకంగా స్పిన్ బౌలర్లు ఈ పిచ్ పై చూపించే అవకాశం ఉంది..కోల్ కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు ఇప్పటివరకు 28 సార్లు తలపడ్డాయి..19 సార్లు కోల్ కతా, 9 సార్లు సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాలు సాధించాయి. 2020 నుంచి 2024 వరకు సన్ రైజర్స్ హైదరాబాద్, కోల్ కతా నైట్ రైడర్స్ 11 సార్లు తలపడగా.. 9 సార్లు కోల్ కతా నైట్ రైడర్స్, 2 సార్లు సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచాయి..కోల్ కతా జట్టు లో అన్రిచ్ నార్ట్జ్వే ఆడకపోవచ్చు.. ఇప్పటివరకు పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన స్పెన్సర్ జాన్సన్ స్థానంలో మోయిన్ అలీని జటలోకి రావచ్చు.. సునీల్ నరైన్ ను ఐపీఎల్ లో రెండుసార్లు పాట్ కమిన్స్ అవుట్ చేశాడు. ఈ క్రమంలో గురువారం కమిన్స్ ముందుగానే బౌలింగ్ చేయవచ్చు.
Also Read : అట్లుంటది తెలుగోళ్ళంటే.. ఫైనల్ లో SRH గెలవాలని ఏం చేశారంటే..
జట్టు అంచనాలు ఇవి
అజింక్యా రహానే(కెప్టెన్), డికాక్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, రఘువంశి, వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, రమణ్ దీప్ సింగ్, మోయిన్ అలీ, హర్షిత్ రాణా, వైభవ్ ఆరోరా, వరుణ్ చక్రవర్తి.
సన్ రైజర్స్ హైదరాబాద్
అభిషేక్ శర్మ, హెడ్, ఇషాన్ కిషన్, నితీష్ రెడ్డి, క్లాసెన్, అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, కమిన్స్(కెప్టెన్), హర్షల్ పటేల్, రాహుల్ చాహర్/ జిషన్ అన్సారి, ఆడం జంపా, మహమ్మద్ షమీ,
Also Read : డౌటే లేదు.. గెలిచేది ఆ జట్టేనటా