Homeక్రీడలుక్రికెట్‌Princy Parikh Reel With David Miller: భారత్ ను ఓడించిన వ్యక్తితో రీల్ చేస్తే...

Princy Parikh Reel With David Miller: భారత్ ను ఓడించిన వ్యక్తితో రీల్ చేస్తే రే*ప్* చేస్తారా..?

Princy Parikh Reel With David Miller: క్రికెట్‌.. ఒకప్పటిలా లేదు. ఆటగాళ్లతోపాటు ఆట తీరు మారిపోతోంది. ఒకప్పుడు టెస్టు, వన్డేలకే పరిమితమైన క్రికెట్‌ టీ20 వచ్చాక చాలా మారిపోయింది. ఇక జెంటిల్‌ మెన్‌గేమ్‌ కాస్త.. వార్‌గా మారిపోయింది. పోటీకి ముందే సవాళ్లు ప్రతిసవాళ్లు చేసుకోవడం, మ్యాచ్‌లో స్లెడ్జింగ్‌ చేయడం ఖామన్‌ అయ్యాయి. ఇక బెట్టింగ్‌లు సరేసరి. అయితే 2011లో బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలిస్తే బట్టలు విప్తేస్తానని సవాల్‌ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చింది. తర్వాత తెలుగు నటి రేఖ కూడా ఇలాంటి ఆఫరే ఇచ్చింది. ఇలా పరిస్థితులు మారిపోయిన తరుణంలో తాజాగా ఓ సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ క్రికెటర్‌తో రీల్‌ చేసింది. దానిని తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేసింది. దీంతో కొందరు.. చంపేస్తామని బెదిరింపులకు దిగారు. బాడీ సేమింగ్‌ చేశారు. దీంతో ఆ వీడియోనే డిలీట్‌ చేయాల్సి వచ్చింది.

టీ20 వరల్డ్‌కప్‌ సందర్భంగా..
టీ20 వరల్డ్‌ కప్‌ సూపర్‌–8లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 63 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఇదే మ్యాచ్‌లో 63 పరుగులు కొట్టిన డేవిడ్‌ మిల్లర్‌ మ్యాచ్‌ విన్నర్‌గా నిలిచాడు. ఈ విజయ ఆనందంలో ఇన్‌ఫ్లుయెన్సర్‌ ప్రిన్సీ పారిఖ్‌ అతనితో షూట్‌ చేసిన రీల్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కానీ ఇప్పుడు ఆ రీల్‌ కారణంగానే పారిఖ్‌కు తీవ్ర బెదిరింపులు, అవమానాలు వస్తున్నాయి.

రీల్‌ వెనుక కథ
మ్యాచ్‌ ప్రారంభానికి ముందు.. ఖాళీ టైం దొరకడంతో మిల్లర్‌తో సెల్ఫీ తీసుకుని రీల్‌ చేసింది పారిఖ్, దాన్ని తన ఫేస్‌బుక్‌లో షేర్‌ చేసింది. అయితే మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయింది. దీంతో ఈ రీల్‌పై భారత్‌ క్రికెట్‌ ప్యాన్స్‌ కామెంట్ల వర్షం కురిపించారు. దీంతో భరించలేక ఫారిఖ్‌ ఆ రీల్‌ డిలీట్‌ చేసింది. అయినా ఆమెకు బెదిరింపులు ఆగడం లేదు. ‘రే*ప్‌* చేస్తాం‘ అంటూ కామెంట్స్‌ ఫెడుతున్నారు. బాడీ షేమింగ్‌ కామెంట్స్‌ పెడుతున్నారు.

హేట్‌ మెస్సేజ్‌లతో ఆందోళన..
సాధారణంగా ఇండియా పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే కొంత ఉద్రిక్తత ఉంటుంది. కానీ సౌత్‌ ఆప్రికా మ్యాచ్‌ తర్వాత భారత ఫ్యాన్స్‌ ఓటమిని జీర్ణించుకోలేక ఫారిఖ్‌ను టార్గెట్‌ చేశారు. ఉరుము ఉరిమి మంగళం మీద పడిన చందంగా క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంతా ఫారిఖ్‌ రీల్‌పై పడ్డారు. ఈ హేట్‌ మెసేజ్‌లతో ఫారిఖ్‌ ఆందోళనకు గురైంది. పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పారిఖ్‌ ప్రకటించింది.

భారత క్రికెట్‌ ఓటమి తర్వాత ఫ్యాన్స్‌ కోపం సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్‌లపై చూపడం కొత్త కాదు. ఇది సైబర్‌ బుల్లింగ్‌కు దారితీస్తోంది. మహిళలపై లింగ వివక్ష, అపవాదాలు పెరుగుతున్నాయి. పోలీసులు, ప్లాట్‌ఫారమ్‌లు వేగంగా చర్యలు తీసుకోవాలి. ఫ్యాన్స్‌ విమర్శలో మర్యాద కాపాడాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version