SRH : 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా రన్నరప్ గా నిలిచింది. స్వదేశంలో జరిగిన ఈ వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ప్రారంభం నుంచి సెమీఫైనల్ దాకా ఒకే రకమైన ఆట తీరు ప్రదర్శించింది. కానీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆస్ట్రేలియా ముందు తలవంచింది… అయితే నాడు వన్డే వరల్డ్ కప్ లో బీసీసీఐ ఒక విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రతి మ్యాచ్ ముగిసిన తర్వాత బెస్ట్ బ్యాటర్, బెస్ట్ ఫీల్డర్, బౌలర్ కు అవార్డులు అందజేయడం మొదలుపెట్టింది. డ్రెస్సింగ్ రూమ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేది. అది ఆటగాళ్లలో స్ఫూర్తిని నింపింది. అదే ఒరవడి టి20 వరల్డ్ కప్ లోనూ కొనసాగించింది. టి20 వరల్డ్ కప్ వెస్టిండీస్ – అమెరికా వేదికగా జరిగింది కాబట్టి.. వెస్టిండీస్ దిగ్గజ ఆటగాళ్లతో ఉత్తమ ఫీల్డర్లకు, ఉత్తమ బ్యాటర్లకు, ఉత్తమ బౌలర్లకు పురస్కారాలు అందించింది. అయితే ఇది టి20 వరల్డ్ కప్ లో సత్ఫలితాన్ని ఇచ్చింది. ఆ సిరీస్ లో కూడా టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ఫైనల్ దాకా వెళ్ళింది. ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికా ను చిత్తు చేసి టి20 వరల్డ్ కప్ దక్కించుకుంది. ఇక ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ టీమిండియా ఇదే ఒరబడి కొనసాగించింది. ఈ సిరీస్ లోనూ టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు.. ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టును ఓడించి ట్రోఫీ సొంతం చేసుకుంది.
Also REad : రోహిత్ భయ్యా.. ఎందుకిలా.. ఎంత చెత్తగా ఆడుతున్నావో తెలుసా?
అదే అనుసరిస్తున్న హైదరాబాద్..
టీమిండియా అనుసరిస్తున్న విధానాన్ని ప్రస్తుతం ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కొనసాగిస్తోంది..సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు శనివారం రాత్రి జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టుపై 8 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ నమోదు చేసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన తర్వాత ఉత్తమ ఫీల్డర్ గా ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసి.. అతడి చేతుల మీదుగా సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఆటోగ్రాఫ్ తీసుకుంది. అతడికి పురస్కారం అందించింది. ఉత్తమ బౌలర్ హర్షల్ పటేల్ తో కూడా ఆటోగ్రాఫ్ తీసుకొని.. పురస్కారం అందించింది. ఇక ఉత్తమ బ్యాటర్ గా అభిషేక్ శర్మను ఎంపిక చేసి.. అతడి చేతుల మీదుగా ఆటోగ్రాఫ్ తీసుకుంది. ఆ తర్వాత అతనికి మెడల్ బహూకరించింది. ఇది బంగారంతో చేసిందని.. ఆటగాళ్లలో ఇలాంటి సత్కారాలు స్ఫూర్తి నింపుతాయని భావించి.. హైదరాబాద్ మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది. అన్నట్టు ప్రస్తుతం పాయింట్లు పట్టికలో హైదరాబాద్ ఎనిమిదవ స్థానంలో ఉంది. ప్లే ఆఫ్ వెళ్లాలంటే హైదరాబాద్ తదుపరి మ్యాచ్లలో ఇదే తీరుగా విజయాలు సాధించాల్సి ఉంది.