Rohith Sharma : రోహిత్ శర్మలోని హిట్టింగ్ చాలా మందికి ఇష్టం.. బీభత్సంగా ఆడుతాడు. భీకరంగా పరుగులు తీస్తాడు. ఏ బౌలర్ అనేది చూడడు. అతడు ఎంత తోపు అని అంచనా వేయడు. అతడికి తెలిసింది కేవలం కొట్టడమే. బంతి పగులుతుంది. బ్యాట్ విరుగుతుంది. అయినప్పటికీ రోహిత్ లో మాత్రం దూకుడు ఆగదు. అయితే అలాంటి రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ లో దారుణంగా విఫలమవుతున్నాడు. తన మార్క్ ఆట మర్చిపోయి.. అనామక ఆటగాడిలాగా ఆడుతున్నాడు. దీంతో ముంబై అభిమానులు ముఖ్యంగా రోహిత్ అభిమానులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అసలు ఎలాంటి రోహిత్.. ఇలా ఆడుతున్నాడు ఏంటని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు..
Also Read : టి20 లలో “విరాట్”పర్వం.. ఆసియా నుంచి ఒకే ఒక్కడు.
ఈ సీజన్లో..
ఈ సీజన్లో రోహిత్ శర్మ ఐదు ఇన్నింగ్స్ లలో ఓపెనర్ గా వచ్చాడు. కనీసం ఒక్క మ్యాచ్లో కూడా 20 పరుగులు కూడా చేయలేకపోయాడు. అయితే ఇన్నింగ్స్లలో అతని హైయెస్ట్ స్కోర్ 18 పరుగులు అంటే.. అతని బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. చెన్నై జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో నాలుగు బంతులు ఎదుర్కొని 0 పరుగులకే రోహిత్ ఔట్ అయ్యాడు. గుజరాత్ టైటాన్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు తో జరిగిన మ్యాచ్లో 13 పరుగులు చేశాడు. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో 17 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 18 పరుగులు చేశాడు. మొత్తంగా ఐదు ఇన్నింగ్స్ లలో 56 పరుగులు చేశాడు.. ఇందులో అతని హైయెస్ట్ 18 పరుగులు మాత్రమే.
చెత్త రికార్డు
2023 తర్వాత ఐపీఎల్ లో ఓపెనర్ గా వచ్చిన ఆటగాళ్లలో అత్యల్ప బ్యాటింగ్ సగటు (25 ఇన్నింగ్స్ లు) నమోదు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మ రెండవ స్థానంలో కొనసాగుతున్నాడు.. ఈ జాబితాలో వృద్ధిమాన్ సాహ (507 పరుగులు, సగటు 20.28), రోహిత్ శర్మ (805 పరుగులు, 24.39 సగటు), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (706 పరుగులు, 26.14 సగటు), ఇషాన్ కిషన్(760 పరుగులు, 27.14 సగటు). 2024లో రోహిత్ శర్మ మెరుగ్గా బ్యాటింగ్ చేసినప్పటికీ.. అంతకుముందు సీజన్లో అంతగా రాణించలేదు. ఇక ప్రస్తుత సీజన్లో దారుణంగా విఫలమవుతున్నాడు. కీలక ఇన్నింగ్స్ ఆడాల్సిన చోట విఫలమవుతున్నాడు. తద్వారా ముంబై జట్టు భారీగా పరుగులు చేయలేకపోతోంది. వరుస ఓటములు ఎదుర్కొంటూ తీవ్రంగా ఇబ్బంది పడుతోంది.. విజయాలు సాధించకపోవడం వల్ల ఈ సీజన్లో ముంబై జట్టు పాయింట్ల ప్రకారం చూసుకుంటే.. 9వ స్థానంలో కొనసాగుతోంది.. ఇది ముంబై జట్టు అభిమానులకు ఏమాత్రం నచ్చడం లేదు.
Also Read : రోహిత్ ఎక్కడ ఉంటే.. అక్కడ చిరునవ్వుంటుంది.. వైరల్ వీడియో