Hit 3 Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంట ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే కొంతమంది యంగ్ డైరెక్టర్స్ సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తమ ప్రతిభ ఏంటో ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక నాని (Nani) హీరోగా శైలేష్ కొలన్ (Shailesh Kolen) దర్శకత్వంలో ‘హిట్ 3’ (Hit 3) సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ ప్రేక్షకులకు అమితంగా నచ్చింది. ఇంతకుముందు హిట్ సిరీస్ నుంచి వచ్చిన రెండు పార్ట్స్ అద్భుతమైన విజయాలను సాధించడంతో ఆటోమేటిగ్గా ఈ మూవీ మీద భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా భారీ సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకు ఈ సినిమా నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వబోతుంది. ట్రైలర్ అనౌన్స్ మెంట్ ఇస్తూ ఒక కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో నాని ఒంటినిండా బ్లడ్ తో నోట్లో సిగార్ పెట్టుకొని టీవీగా కూర్చొని ఉన్నాడు… ఆయన వెనకాల ఉన్న గోడ మీద మొత్తం బ్లడ్ మరకలుఉన్నాయి.
Also Read : ప్యారడైజ్ లో ఫస్ట్ సీన్ ఏంటో తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది…
అతని షర్టు చేతులతో పాటు మొహం మొత్తం బ్లడ్ మరకలు ఉండడంతో ఈ సినిమాతో నాని నటుడిగా మరొక స్టెప్ ముందుకు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. దసర (Dasara) సినిమాతో తనలో ఉన్న మాస్ యాంగిల్ మొత్తాన్ని బయటికి తీసిన నాని ఇప్పుడు తనలో ఉన్నటువంటి ఒక సైకో ఇజాన్ని కూడా బయటికి తీసి యావత్ ప్రేక్షకులు అందరితో శభాష్ అనిపించుకునే పెర్ఫామెన్స్ ఇవ్వడానికి ఆయన సిద్ధమవుతున్నాడు.
సినిమా సినిమాకి వేరియేషన్స్ ని చూపిస్తూ ముందుకు సాగుతున్న నాని ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా అలాంటి వైవిద్యభరితమైన పాత్రలను ఎంచుకొని తనకంటూ ఒక సపరేట్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ఉద్దేశ్యంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి నాని నుంచి వస్తున్న సినిమా అంటే ప్రేక్షకుల్లో మినిమం గ్యారంటీ అంచనాలైతే ఉంటాయి.
ఇక దానికి ఏ మాత్రం తగ్గకుండా ఈ మూవీ ఉండబోతుందిదట…రేపు రిలీజ్ అయ్యే ట్రైలర్ ని కూడా చాలా అద్భుతంగా కట్ చేసినట్టుగా సినిమా యూనిట్ నుంచి కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. మరి హిట్ 3 సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతుంది. కాబట్టి ఈ సినిమాతో ప్రతి ఒక్కరు థ్రిల్ ఫీలవుతారు అంటూ దర్శకుడు శైలేష్ కోలన్ తో పాటు నాని కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్నాడు…
Also Read : ‘హిట్ 3′ టీం కి వార్నింగ్ ఇచ్చిన సెన్సార్ బోర్డు..మరీ ఇంత దారుణమా!