Spain vs Argentina: స్పెయిన్ గెలిచింది. 16 సంవత్సరాల తర్వాత ఫిఫా వరల్డ్ కప్ అందుకుంది. గొప్ప గొప్ప ప్లేయర్లు ఉన్న జట్లు కూడా ఇంటికి వెళ్లి పోతాయి.. స్థిరమైన ఆట తీరు కొనసాగించి స్పెయిన్ విజేతగా నిలిచింది. స్పెయిన్ జట్టుతో పోల్చి చూస్తే అర్జెంటీనా అత్యంత బలమైనది. అయినప్పటికీ అర్జెంటీనాను స్పెయిన్ ఓడించింది అంటే మామూలు విషయం కాదు.
స్పెయిన్ ఈ ట్రోఫీలో అద్భుతమైన ఆట తీరు కొనసాగించింది. ప్లేయర్లు మైదానంలో స్థిరమైన ఆట తీరు ప్రదర్శించారు. స్పెయిన్ ఇలా గెలవడానికి ఓ బలమైన సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాన్ని ఉపయోగించి అద్భుతమైన విజయం సాధించింది.. గేమ్ ప్లాన్ లో భాగంగా స్పెయిన్ అర్జెంటీనా మీద టికీ టాకా 2.0 ను ప్రయోగించింది.
దీని ప్రకారం ఖాళీ మైదానాన్ని స్పెయిన్ జట్టు ఆటగాళ్లు ఎంచుకుంటారు. ట్రయాంగిల్ ఆకారంలో తక్కువ దూరంలో ఉంటారు. ఒకరిని ఒకరు బంతిని పాస్ చేసుకుంటారు. ఇలా ప్రత్యర్థులకు చుక్కలు చూపిస్తుంటారు. బంతిని ఏమాత్రం గోల్ పోస్ట్ లోకి పంపడానికి అవకాశం ఇవ్వరు. సరిగా 1988 -96 కాలం మధ్యలో బార్సిలోనా జట్టు అమల్లోకి తీసుకువచ్చింది. 2010లో స్పెయిన్ జట్టు ప్రపంచ కప్ గెలిచింది. అప్పుడు కూడా ఈ వ్యూహాన్ని అమలు చేసింది 2008 నుంచి 2012 మధ్యలో స్పెయిన్ జట్టు ఇదే సిద్ధాంతాన్ని అమలు చేసింది
కాలక్రమంలో ఈ విధానానికి ప్రత్యర్థులు విరుగుడుగా ఆట మొదలుపెట్టారు. అయితే కొన్ని సందర్భాలలో స్పెయిన్ జట్టు ప్లేయర్లను కవ్వించేవారు. పెనాల్టీలు కూడా వేయించేవారు. అప్పుడు స్పెయిన్ జట్టు కేవలం పాస్ లకు మాత్రమే పరిమితమైంది. గోల్స్ చేయడంలో విఫలమైంది. అందువల్లే 2018, 2022 లో ప్రపంచ కప్ లలో ఇంటికి వెళ్ళిపోయింది.
తాజా వరల్డ్ కప్ లో స్పెయిన్ తన పాత విధానానికి అలవాటు పడింది. దానికి కొత్త హంగులు జోడించింది. కోచ్ లూయిస్ జట్టుకు ఎటాకింగ్ నేర్పించాడు. మార్పులు చేపట్టాడు. పాస్ లతోనే ఆగిపోకుండా.. ప్రత్యర్థి ప్లేయర్లు ముందుకు వచ్చినప్పుడు వారి గ్యాప్ లలో దాడి చేయించడం నేర్పించాడు.. బంతిని ఎక్కువసేపు తమ వద్ద అట్టి పెట్టుకోకుండా.. స్కోర్ చేసే విధంగా శిక్షణ ఇచ్చాడు. యంగ్ వింగర్లు యామాల్.. విలియమ్స్ మంటి వారిని పగడ్బందీగా ఉపయోగించుకున్నాడు. అందువల్లే స్పెయిన్ విజేతగా నిలవగలిగింది. మొత్తం 8 మ్యాచ్ లు ఆడిన స్పెయిన్.. 14 గోల్స్ చేసింది. ఇందులో ప్రత్యర్థికి కేవలం ఒకే ఒక్క గోల్ చేసే అవకాశం ఇచ్చింది.


