Homeఆంధ్రప్రదేశ్‌YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి...

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు కల్పించారని.. వెనకేసుకోవడానికి స్వేచ్ఛ ఇచ్చారని.. అందువల్లే గురుభక్తిగా ప్రభుత్వ భూములను రాసిచ్చారు. కనీసం నిబంధనలు కూడా పట్టించుకోకుండా.. ఏకపక్షంగా వ్యవహరించారు. ఇప్పుడు ఆ భూసంతర్పణ వెలుగులోకి వచ్చింది.

ఆయన పేరు మహేశ్వర్ రెడ్డి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు.. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. అప్పటి అధికార పార్టీ నేతలతో మహేశ్వర్ రెడ్డి బ్రహ్మాండంగా కలిసిపోయారు. నాడు ఈయన కడప జిల్లాలోని సికే దీన్నే మండలంలో తహసీల్దార్ గా పనిచేశారు. ఈ ప్రాంతంలో 15.94 ఎకరాల చుక్కల భూమి ఉంది. ఇదంతా కూడా నిషేధిత జాబితాలో ఉంది. 22a జాబితాలో ఉన్నప్పటికీ ఈ భూమిని వైసీపీ నేతల పేరు మీద చేశారు నాటి తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి. ఆ భూములలో వైసీపీ నేతలు భావన పేరుతో టౌన్షిప్ ఏర్పాటు చేశారు. ఇందులో తహసీల్దార్ మహేశ్వర్ రెడ్డి కూడా వాటా ఉందని అప్పట్లో మీడియాలో వార్తలు వచ్చాయి.

దీనిపై సబ్ కలెక్టర్ విచారణ నిర్వహించారు. మొత్తంగా మ్యుటేషన్ లు, అడంగల్ పహానిలో సవరణలు.. భూముల నమోదులో అక్రమాలు చేసుకున్నట్టు గుర్తించారు. ప్రభుత్వానికి నివేదిక్ కూడా ఇచ్చారు.. అప్పట్లోనే కలెక్టర్ ఈ నివేదికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే.. నాటి పెద్దలు పెద్దగా పట్టించుకోలేదు. కాగా కంటితడుపుగా చర్యలు తీసుకున్నారు. కొద్దిరోజులు సస్పెన్షన్ వేటు వేసి.. ఆ తర్వాత ఎత్తివేశారు.

ప్రస్తుత సీకే దిన్నే తహసీల్దార్ నాగేశ్వర్ రెడ్డి.. మహేశ్వర్ రెడ్డి మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తుల పరం చేయటం వల్ల ప్రభుత్వానికి విపరీతమైన నష్టం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ భూమి మీద కూడా వందల కోట్లలో ఉంటుందని తహసీల్దార్ నాగేశ్వర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక మహేశ్వర్ రెడ్డి చేసిన భూ వివాదం వల్ల సరిగా మూడు నెలల క్రితం కడపలో వైసిపి నేత పెద్ద దస్తగిరి హత్యకు గురయ్యారు. ఆయనను సొంత పార్టీ నేతలే హత్య చేశారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Team India : జింబాబ్వే టూర్ కు టీమిండియా ఇదే.. వాళ్ల మీద మనోళ్ళ రికార్డులు ఎలా ఉన్నాయంటే..

Team India : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలో టి20.. వన్డే సిరీస్ కోల్పోయిన తర్వాత టీమిండియా పూర్తిగా నిరాశలో కూరుకుపోయింది. బౌలింగ్ దారుణంగా ఉంది. బ్యాటింగ్ చెత్తగా ఉంది....

TTD : చంద్రబాబు జైల్లో చనిపోతే పొట్టేళ్ల విందు.. అటువంటి అధికారికి తిరుమలలో ఏఈఈ పోస్ట్..

TTD : రాజకీయ నాయకులు రాజకీయాలు చేస్తుంటారు. వాళ్లలో వాళ్లకు వ్యూహాలు ఉంటాయి. ఎత్తులు ఉంటాయి. వాటిని చిత్తు చేసే ఎత్తుగడలు కూడా ఉంటాయి. ఇవన్నీ రాజకీయంలో ఒక భాగం. కానీ ఉద్యోగులు...

Punjab Politics : పంజాబ్ పై మోడీ ఫోకస్.. ఏదో పెద్ద ప్లానింగే

Punjab Politics : పంజాబ్‌లో గతంలో నిరాశాజనకంగా ఉన్న ఫలితాలను పక్కనబెట్టి, బీజేపీ ఇప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం రెండు సీట్లతో...

Team India : ఈ స్క్రాప్ బౌలింగ్ తో వరల్డ్ కప్ కాదు కదా.. గ్రూప్ స్టేజీ దాటడం...

Team India : ఐపీఎల్ అనేది కాసుల క్రీడ. కేవలం బ్యాటర్ల కోసం మాత్రమే మైదానాలను రూపొందిస్తారు. అవన్నీ కూడా ప్లాట్ గా ఉంటాయి. ఒకరకంగా చెప్పాలంటే సిమెంట్ రోడ్ లాంటి మైదానాలు...

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
Oktelugu Epaper
Exit mobile version