Rajamouli Next Movie: ప్రస్తుతం రాజమౌళి ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ముఖ్యంగా మహేష్ బాబు ఈ సినిమాలో హీరోగా చేయడం వల్ల తెలుగుతో పాటు పాన్ ఇండియాలో కూడా ఈ సినిమాకి మంచి గుర్తింపైతే వస్తుంది. ప్రపంచ స్థాయి ప్రేక్షకులను అలరించడానికి తెరకెక్కిస్తున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. మహేష్ బాబు అయితే చాలా కష్టపడి మరి ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన తెలుగులో మాత్రమే సినిమాలను చేశాడు. పాన్ ఇండియా పరిధికి కూడా వెళ్ళలేదు. అలాంటి మహేష్ బాబు ఇప్పుడు ప్రపంచ స్థాయి ప్రేక్షకులలో సూపర్ హీరోగా పేరు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా భారీ విజయాన్ని సాధిస్తే మాత్రం మహేష్ బాబు ఓవర్ నైట్ లో స్టార్ హీరోగా మారిపోతాడు. ప్రపంచ స్థాయి ప్రేక్షకులందరిని అలరించే హీరోగా మారడం అనేది మామూలు విషయం కాదు.
ఒక్క సినిమాతోనే తాను భారీ రేంజ్ కి వెళ్లబోతున్నాడు అనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది. రాజమౌళి పుణ్యమాని మహేష్ బాబు ప్రపంచ స్థాయిలో స్టార్ హీరోగా ఎదిగితే మాత్రం అతని అభిమానులు సైతం ఆనందాన్ని వ్యక్తం చేసే అవకాశమైతే ఉంది…ఇక రాజమౌళి ఈ మూవీ తర్వాత పాకిస్తాన్ బ్యాక్ డ్రాప్ తో ఒక సినిమాని తెరకెక్కించే అవకాశాలు ఉన్నాయని కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
రీసెంట్ గా దురంధర్ సినిమా మొత్తం చూపించారు. అలాంటి కథతోనే రాజమౌళి కూడా రాబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి… విజయేంద్ర ప్రసాద్ సైతం ఈ కథ కి సంబంధించిన కొన్ని విషయాలను ప్రేక్షకులకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ రెడీ చేశారట.
ఆ కథ ఎలా ఉండబోతుంది అందులో హీరోగా ఎవరు చేస్తారు అనే విషయాల పట్ల సరైన క్లారిటి రావాల్సి ఉంది… ఈ సినిమాలో రాజమౌళి ఏం చూపిస్తాడు? విజయేంద్ర ప్రసాద్ పెన్ను పవర్ ఏంటి అనేది తెలియాలంటే ఈ కోణం రావాల్సిందే అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు.


