South Africa T20 League: దక్షిణాఫ్రికా 2020 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఫైన్‌లో డబర్బన్ సూపర్‌జెయింట్‌పై 89 పరుగుల తేడాతో ఓడించి ఐడెన్ మార్‌కామ్ జట్టు రెండోసారి టైటిల్ విజేతగా నిలిచింది. 2023లో జరిగిన టీ20లీగ్ మొదటి ఎడిషన్‌లో ట్రోఫీ కైవసం చేసుకుంది. తాజగా 2024లోనూ సన్ రైజర్స్ వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలిచింది. ఈ టైటిల్ గెలిచినందుకు ఆ జట్టుకు భారీగా ప్రైజ్ మనీ అందింది.
ప్రైజ్ మనీ ఎంతంటే..
దక్షిణాప్రికా టీ20 లీగ్ చాంపియన్‌కు 3.25 కోట్ల ర్యాండ్స్ అందనున్నాయి. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.14.21 కోట్లు అన్నమాట. ఈ మొత్తాన్ని సన్‌రైజర్స్ ఈస్టర్ప్ కేప్ జట్టు గెలుచుకుంది. ఇక ఈ లీగ్‌లో రన్నరప్‌గా నిలిచిన జట్టుకు 1.62 ర్యాండ్స్ అందనున్నాయి. అంటే 7.2 కోట్లు అన్నమాట. ఈ మొత్తాన్ని డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు గెలుచుకుంది.
సన్‌రైజర్‌కు ఇవి కూడా..
ప్రైజ్ మనీతోపాటు సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టుకు స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు (రూ.4.37 లక్షలు) అందనుంది. బెస్ట్ బ్యాటర్‌గా హెన్రిక్ క్లాసెన్(రూ.8.74 లక్షలు), బెస్ట్ బౌలర్‌గా ఓట్నీ బార్ట్‌మన్(రూ.8.74 లక్షలు) అందుకున్నారు. డబర్బన్ సూపర్ జెయింట్స్ ఆటగాడు హెన్రిక్ క్లాసెన్ రూ.15.30 లక్షలతోపాటు సౌత్ ఆఫిక్రి టీ20 లీగ్ 2024 బెస్ట్ ప్లేయర్ అవార్డు అందుకున్నాడు.