Shubman Gill Batting Average in England : టీమిండియాలో సుదీర్ఘ ఫార్మాట్ కు నాయకత్వం వహించిన ప్లేయర్లకు చాలా అనుభవం ఉంది. వారంతా వన్డే లో సత్తా చూపించిన తర్వాతే సుదీర్ఘ ఫార్మాట్లో నాయకత్వ బాధ్యతలు స్వీకరించారు. గిల్ వన్డేలలో పరవాలేదనిపించినప్పటికీ.. అతడికి ఉన్న అనుభవం దృష్ట్యా.. కెప్టెన్ గా జట్టును ముందుకు నడిపించే సామర్థ్యం మాత్రం లేదు. అయినప్పటికీ మేనేజ్మెంట్ అతడికి అవకాశం కల్పించింది. మేనేజ్మెంట్, కోచ్ గిల్ పై విపరీతమైన నమ్మకం పెట్టుకున్నారు. మరో మాటకు తావు లేకుండా.. ఎన్ని విమర్శలు వస్తున్నప్పటికీ గిల్ కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. అంతేకాదు ఇంగ్లీష్ జట్టుతో ఈ నెలలో ప్రారంభమయ్యే ఐదు టెస్టుల సిరీస్ లో జట్టును నడిపించాలని హితోపదేశం చేశారు.
Also Read : అసలు పిచ్ లు దాచేసి..డమ్మీ పిచ్ లు రూపొందించి.. ఇంగ్లండ్ చీటింగ్..బీసీసీఐకి షాక్!
గిల్ నాయకత్వంలో టీమిండియా ఇంగ్లీష్ గడ్డమీద అడుగుపెట్టింది. ఇప్పటికే సుదీర్ఘ సుదీర్ఘ ఫార్మాట్లో భారతదేశానికి చెందిన మరో బృందం ఇంగ్లీష్ జట్టుతో అనధికారికంగా ఒక టెస్ట్ ఆడింది. కాకపోతే అది డ్రా అయింది. ఇక రెండవ అనధికారిక టెస్ట్ కూడా మొదలైంది. మొత్తంగా భారత ప్లేయర్లకు కావలసినంత ప్రాక్టీస్ లభిస్తోంది. బౌలింగ్, బ్యాటింగ్ లో మన ప్లేయర్లు ఇంగ్లీష్ గడ్డ మీద సత్తా చూపించడానికి రెడీ అవుతున్నారు. దానికంటే ముందు లభించిన అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారు. మిగతా ప్లేయర్ల సంగతి పక్కన పెడితే.. ఇంగ్లీష్ గడ్డమీద కెప్టెన్ గిల్ గణాంకాలు అత్యంత దారుణంగా ఉన్నాయి.. ఇంగ్లీష్ గడ్డమీద గిల్ రెండు టెస్టులలో ఆడాడు. నాలుగు ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేశాడు. అతడి సగటు 14.25 మాత్రమే. అతడు చేసింది 57 పరుగులే. 2021లో కివీస్ జట్టుతో డబ్ల్యూటీసీ ఫైనల్స్ లో గిల్ ఆడాడు.
నాటి మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 36 పరుగులు మాత్రమే చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 28, రెండవ ఇన్నింగ్స్ లో 8 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాదు ఇక 2022లో ఇంగ్లీష్ జట్టుతో జరిగిన ఐదవ టెస్టులో గిల్ ఆడాడు. నాటి మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్ లో 17 పరుగులు, రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులు మాత్రమే చేశాడు. ఇక జేమ్స్ అండర్సన్, బ్రాడ్ వంటి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయాడు. వారి బౌలింగ్లో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ అవతల పడిన బంతులను అనవసరంగా వేటాడి తగిన మూల్యం చెల్లించుకున్నాడు. ఇప్పుడు గిల్ భారత జట్టుకు నాయకుడు అయ్యాడు. నాటి వైఫల్యాల నుంచి గిల్ పాఠాలు నేర్చుకుంటాడా.. జట్టును సమర్థవంతంగా నడిపిస్తాడా అనేది చూడాల్సి ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.