Akshay Kumar Viral Video : ప్రొమోషన్స్ చేయడం లో బాలీవుడ్ హీరోలకు సాటి మరెవ్వరూ రారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అక్కడి హీరోలకు ఈ విషయాల్లో ఎలాంటి ఈగోలు ఉండవు. నేరుగా పబ్లిక్ లోకి వెళ్లి మారు వేషం లో తిరుగుతూ తన సినిమాని ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా కొంతమంది హీరోలు తమ సినిమాకు ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకోవడం కోసం మారు వేషం లో వెళ్లి యూట్యూబర్ లాగా థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకులను సినిమా ఎలా ఉంది అని అడుగుతుంటారు. ఇప్పుడు అక్షయ్ కుమార్(Akshay Kumar) రీసెంట్ గా అదే చేసాడు. ఆయన హీరో గా నటించిన ‘హౌస్ ఫుల్ 5′(Housefull 5) చిత్రం ఈ శుక్రవారం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా రివ్యూ తెలుసుకోవడం కోసం స్వయంగా అక్షయ్ కుమార్ తన టీమ్ తో కలిసి రంగంలోకి దిగాడు.
Also Read : మార్కో’ డైరెక్టర్ తో బాలయ్య..స్టోరీ లైన్ చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చేస్తుందిగా!
ఒక థియేటర్ లో ముఖానికి మాస్క్ వేసుకొని, చేతిలో మైక్ పట్టుకొని, సినిమా ఎలా ఉంది అంటూ థియేటర్ లోపల నుండి వచ్చే ప్రతీ ప్రేక్షకుడిని అడుగుతూ ఉన్నాడు. కొంతమంది బాగుందని, మరికొంతమంది బాగాలేదని చెప్పుకొచ్చారు. కొంతమంది అయితే అసలు మాట్లాడడం కూడా ఇష్టం లేక పక్కకి వెళ్లిపోయారు. అలా విభిన్నమైన అభిప్రాయాలను తెలుసుకున్నాడు అక్షయ్ కుమార్. అయితే కొంతమంది ప్రేక్షకులు మాత్రం ఇతను అక్షయ్ కుమార్ అని తెలుసుకున్నారు. బయటకి చెప్పకుండా సైలెంట్ గా వీడియో తీసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేయగా, అది బాగా వైరల్ అయ్యింది. ఇలా మన సౌత్ లో ఇప్పటి వరకు ఒక్క హీరో అయినా చేశాడా చెప్పండి?, సినిమాని ప్రమోట్ చేయడం లో బాలీవుడ్ నటులు ఒక అడుగు ముందు ఉంటారు అనడానికి బెస్ట్ ఉదాహరణ ఇదే. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది, కొందరు ట్రోల్స్ కూడా వేస్తున్నారు.
ఇకపోతే ‘హౌస్ ఫుల్ 5’ చిత్రానికి కాస్త డివైడ్ టాక్ వచ్చింది. కామెడీ అంటే అస్లీల సన్నివేశాలతో నింపేయడం అని డైరెక్టర్ ఉద్దేశ్యం ఏమో అని ఈ చిత్రంపై తీవ్రమైన విమర్శలు కూడా వచ్చాయి. కానీ బాలీవుడ్ లో పాపులర్ ఫ్రాంచైజ్ కాబట్టి మొదటి రోజు ఓపెనింగ్ అదిరిపోయింది. మొదటి రోజు దాదాపుగా 24 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, రెండవ రోజు ఏకంగా 32 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టింది. ఇక మూడవ రోజు అయితే మొదటి రెండు రోజులకంటే ఎక్కువ వసూళ్లు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అలా కేవలం మూడు రోజుల్లోనే ఈ చిత్రం అక్షయ్ కుమార్ గత చిత్రం ‘కేసరి : చాప్టర్ 2’ క్లోజింగ్ కలెక్షన్స్ ని దాటేస్తుందని బాలీవుడ్ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.