England Fake pitch Controversy : సుధీర్ఘ ఫార్మాట్ లో రెండు జట్ల ప్లేయర్లు అదరగొట్టాలి గాని మ్యాచ్ హోరా హోరీగా సాగుతుంది. వన్డే, టి20కి మించిన ఆనందాన్ని అందిస్తుంది. అయితే ఫార్మాట్ లో ఆతిథ్య జట్లు స్ఫూర్తిని ప్రదర్శించాలి. అది తప్ప తమ జట్టు మాత్రమే గెలవాలి అనే కాంక్షతో ఉండకూడదు. ముఖ్యంగా పిచ్ ల రూప కల్పనలో ఇష్టానుసారంగా వ్యవహరించకూడదు. దానివల్ల సుదీర్ఘ ఫార్మాట్ అర్థమే మారిపోతుంది. చూస్తున్న ప్రేక్షకులకు సిసలైన క్రికెట్ మజా దూరం అవుతుంది. ఇప్పుడు ఎందుకు ఇంతటి ప్రస్తావన అంతే.. ఆగండాగండి అక్కడిదాకా వస్తున్నాం..
Also Read : చెప్పుకునేందుకు శతకం లేదు… ఇంగ్లాండ్ లో గిల్ ఏం చేస్తాడో?
ఇప్పటికే టీమిండియా ఇంగ్లీష్ గడ్డపై అడుగు పెట్టింది. ఆ దేశంతో సుదీర్ఘ ఫార్మాట్లో ఐదు టెస్టులు ఆడుతుంది. ఇప్పటికే అనధికారిక టెస్టులు మొదలయ్యాయి. తొలి టెస్ట్ డ్రా అయింది. ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు పై భారత బ్యాటర్లు కదం తొక్కారు. బౌలింగ్ ను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. మొత్తంగా తన నుంచి కఠినమైన సవాల్ ఎదురవుతుందని ఇంగ్లీష్ జట్టుకు సంకేతాలు పంపించారు. ఇక రెండవ అనధికారిక టెస్ట్ మొదలైంది. ఇండియా ఏ జట్టు ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో తలపడుతోంది. ఈ అనధికారిక టెస్ట్ సందర్భంగా ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ టీం మేనేజ్మెంట్ విమర్శలకు గురవుతోంది. రెండవ అనధికారిక టెస్టులో పిచ్ ను పూర్తిగా మార్చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి మొదటి అనధికారిక టెస్టులో భారత బౌలర్లు రెచ్చిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన ఇంగ్లీష్ జట్టు మేనేజ్మెంట్ మనసు మార్చుకోండి.. ఒక్కసారిగా రెండవ అనధికారిక టెస్ట్ కు ఫ్లాట్ పిచ్ ను ఇంగ్లాండ్ వేల్స్ క్రికెట్ బోర్డు రూపొందించింది. మొదటి అనధికారిక టెస్టులో స్వింగ్ పిచ్ ఏర్పాటు చేసింది. దానిపై భారత బౌలర్లు చెలరేగిపోయారు. ఇలాంటి పిచ్ లు కనుక రూపొందిస్తే సిరీస్ లో భారత బౌలర్లు రెచ్చిపోయే ప్రమాదం ఉందని భావించిన ఇంగ్లీష్ క్రికెట్ బోర్డు.. వెంటనే రెండవ అనధికారిక టెస్ట్ కు పిచ్ ను మార్చేసింది. ప్లాట్ పిచ్ ను రూపొందించింది.
ప్లాట్ పిచ్ పై బౌలర్లకు ఆశించిన స్థాయిలో ప్రాక్టీస్ లభించదు.. దానివల్ల వచ్చే మ్యాచ్లలో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. వికెట్లు తీయడం కష్టమవుతుంది. అయితే పిచ్ ను మార్చడం వల్ల భారత బౌలర్లకే కాకుండా ఇంగ్లీష్ బౌలర్లకు కూడా ఇబ్బందికరమైన పరిణామం ఏర్పడుతుంది. కాకపోతే ఈ విషయాన్ని గుర్తించకుండా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డులో కొంతమంది పెద్దలు ఏకపక్షంగా పిచ్ ను మార్చడం పట్ల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు పెద్దలు ఇంతవరకు నోరు మెదపలేదు. గతంలో ఇంగ్లీష్ జట్టు మనదేశంలో పర్యటించినప్పుడు కొంతమంది బోర్డు పెద్దలు పిచ్ లను మార్చినట్టు ఆరోపణలు వినిపించాయి. అప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. అయినప్పటికీ బీసీసీఐ వర్గాలు నిశ్శబ్దంగానే ఉన్నాయి. ఇక ఇంగ్లీష్ జట్టుతో.. వారి స్వదేశంలో జూన్ 20 నుంచి గిల్ సేన 5 టెస్టుల సిరీస్ ఆడుతుంది.