Shreyas Iyer : సామాన్యులకే కాదు.. గొప్ప గొప్ప క్రికెటర్లకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. టీమిండియా యువ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అలాంటి దుస్థితిని స్వయంగా చవిచూశాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్లో పంజాబ్ జట్టును (PBKS) ముందుండి నడిపిస్తున్నాడు. ఇప్పటివరకు పంజాబ్ జట్టు మూడు మ్యాచ్లు ఆడింది. రెండు విజయాలతో పాయింట్లు పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది.. పంజాబ్ జట్టుకు దిశా నిర్దేశమే కాదు.. బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకలాగా నిలుస్తున్నాడు శ్రేయస్ అయ్యర్. అందువల్లే ఆ జట్టు గత సీజన్ల కంటే భిన్నంగా ఆడుతోంది. ఐకమత్యానికి.. సమష్టి తత్వానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఆ జట్టుకు పరిణామాలు అన్నీ అనుకూలంగా మారితే విజేతగా నిలిచే అవకాశాలను కూడా కొట్టి పారేయలేనివి.. గత సీజన్లో అయ్యర్ కోల్ కతా జట్టుకు నాయకత్వం వహించాడు. ఆ జట్టును విజేతగా నిలిపాడు. 10 సంవత్సరాల ట్రోఫీ కరువును తీర్చాడు.. అయితే అతడిని కోల్ కతా నైట్ రైడర్స్ యాజమాన్యం రిటైన్ చేసుకోలేదు.. దీంతో అతడిని పంజాబ్ జట్టు యాజమాన్యం మెగా వేలంలో సొంతం చేసుకుంది.
Also Read : ఈడెన్ గార్డెన్స్ లో కోల్ కతా అభిమానులు చేసిన పనికి అందరూ ఫిదా
నామినేట్ అయ్యాడు
ఇక గత ఏడాది బీసీసీఐ కాంట్రాక్ట్ జాబితాలో అయ్యర్ చోటు కోల్పోయాడు. అంతేకాదు కీలకమైన మ్యాచులలో కూడా అతనికి అవకాశం లభించలేదు. దీంతో అతడు రంజీ బాట పట్టాడు. వీరోచితమైన ఆట ఆడాడు. దీంతో అతడికి ఇంగ్లాండ్ సిరీస్ లో అవకాశం లభించింది. అందులో తాను ఏంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీలో అవకాశం వచ్చింది. అక్కడ కూడా జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్లో అతడు ఆడిన ఇన్నింగ్స్ లను సగటు భారత క్రికెట్ అభిమాని మర్చిపోలేడు. ఇక ఇప్పుడు పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తూ అదిరిపోయే విజయాలు అందిస్తున్నాడు. వాస్తవానికి పంజాబ్ జట్టు మేనేజ్మెంట్ కూడా ఈ స్థాయిలో విజయాలు లభిస్తాయని కలలో కూడా ఊహించలేదు. ఇక శ్రేయస్ అయ్యర్ ఐసీసీ వన్డేర్యాంకింగ్స్ లో ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ ఐసీసీ మార్చి నెలలో ఇచ్చే ఉత్తమ ప్లేయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. దీంతో అతని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయ్యర్ 2015లో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ ఏడాది అద్భుతంగా ఆడటంతో.. అతడికి ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు ఇచ్చారు. ఇక ఇప్పుడు స్థిరంగా శ్రేయస్ అయ్యర్ క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో అతడికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇటీవల పంజాబ్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. భవిష్యత్తు కాలంలో టీమ్ ఇండియాకు శ్రేయస్ అయ్యర్ నాయకత్వం వహించే అవకాశాలను కొట్టి పారేయలేమని.. అతడు సమర్థవంతమైన నాయకుడని కొనియాడాడు. అంటే ఈ లెక్కన అయ్యర్ పొలంలో మొలకలు వచ్చినట్టే కదా.
SHREYAS IYER NOMINATED FOR ICC PLAYER OF THE MONTH FOR MARCH pic.twitter.com/OvQShSiXuL
— Johns. (@CricCrazyJohns) April 8, 2025