Shreyas Aiyer: ‘అయ్యర్’ కోసం అతడిపై వేటు పడనుందా?

Shreyas Aiyer: భారత్-న్యూజిల్యాండ్ మధ్య టెస్టు సీరిస్ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే తొలి టెస్ట్ పూర్తి చేసుకున్న ఇరుజట్లు మ్యాచ్ ను డ్రాగా ముగించాయి. ఈక్రమంలోనే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం రెండు జట్లు సన్నహాలు చేసుకుంటున్నాయి. సీరిస్ గెలుపునకు ఈ మ్యాచ్ కీలకం కానుండటంతో ఇండియన్ టీం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా జట్టు కూర్పు చేస్తోంది. కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నారు. అతడి […]

Written By: NARESH, Updated On : December 2, 2021 10:22 am
Follow us on

Shreyas Aiyer: భారత్-న్యూజిల్యాండ్ మధ్య టెస్టు సీరిస్ జరుగుతున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే తొలి టెస్ట్ పూర్తి చేసుకున్న ఇరుజట్లు మ్యాచ్ ను డ్రాగా ముగించాయి. ఈక్రమంలోనే రెండో టెస్ట్ మ్యాచ్ కోసం రెండు జట్లు సన్నహాలు చేసుకుంటున్నాయి. సీరిస్ గెలుపునకు ఈ మ్యాచ్ కీలకం కానుండటంతో ఇండియన్ టీం ప్రత్యర్థికి ఎలాంటి అవకాశాలు ఇవ్వకుండా జట్టు కూర్పు చేస్తోంది.

Shreyas Aiyer

కాన్పూర్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ విరాట్ కోహ్లీ దూరంగా ఉన్నారు. అతడి స్థానంలో శ్రేయర్ అయ్యర్ జట్టులోకి వచ్చాడు. అరగేట్రం మ్యాచ్ లోనే అయ్యర్ అదరగొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్ లో అర్థ సెంచరీ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచాడు. దీంతో సెకండ్ టెస్ట్ మ్యాచ్ కు సైతం అతడిని కొనసాగించే అవకాశం కన్పిస్తోంది.

రెండో టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ విరాట్ కోహ్లీ అందుబాటులోకి రానున్నాడు. అదేవిధంగా అతడి స్థానంలో తొలి టెస్టు మ్యాచులో ఆడిన శ్రేయర్ అయ్యర్ కూడా జట్టులోనే కొనసాగించేందుకు టీం మేనేజ్మెంట్ మొగ్గుచూపుతోంది. దీంతో అయ్యర్ ను ఎవరి స్థానంలో ఆడిస్తారనే చర్చ జోరుగా నడుస్తోంది. దీంతో అందరిచూపు ప్రస్తుత పేలవఫామ్ తో ఉన్న రహనేపైనే పడుతోంది.

Also Read: కీలక ప్లేయర్ ను ఎందుకు తప్పించినట్లు?

భారత గడ్డపై ఇంగ్లాడ్ టెస్ట్ సీరిస్ ఆడినప్పటి నుంచి రహానే ఫామ్ కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ సీరిస్ లలో అతడి సగటు వరుసగా 19.57, 18.66గా ఉంది. న్యూజిల్యాండ్ తో ఆడిన తొలి టెస్టులోనూ 35, 4 పరుగులు మాత్రమే చేశాడు. పూజరా సైతం పరుగుల కోసం ఇబ్బంది పడుతున్నాడు. గత 12 ఇన్నింగ్స్ ల్లో కేవలం రెండుసార్లు మాత్రం 50కిపైగా పరుగులు చేశాడు.

పూజారా క్రీజులో నిలదొక్కుకునే క్రమంలో ఎక్కువ బంతులు ఆడుతూ స్ట్రెయిక్ రేట్ పేలవంగా చేస్తున్నారు. దీంతో అతడి బ్యాటింగ్ సైతం ఇటీవల విమర్శలు వస్తున్నాయి. అలాగే మయాంక్ అగర్వాల్ కూడా గత పది ఇన్నింగ్స్ లో ఒక్క ఆఫ్ సెంచరీ కూడా చేయలేదు. అయితే జట్టులో రిజర్వ్ ఓపెనర్ లేకపోవడం అతడికి వరంగా మారింది. మొత్తంగా రహానేనే తప్పించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తుండటంతో కోహ్లీ ఏ నిర్ణయం తీసుకుంటాడోననే ఆసక్తి నెలకొంది.

Also Read: ఐపీఎల్ లో ఏ టీంలో ఎవరు ఇన్.. ఎవరు ఔట్