Kadapa DCCB Jobs: కడప డీసీసీబీలో 75 ఉద్యోగ ఖాళీలు.. మంచి జీతంతో?

Kadapa DCCB Jobs: దేశంలోని కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు కడప డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ శుభవార్త చెప్పింది. క్లర్క్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 75 క్లర్క్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్లు క్లర్క్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు […]

Written By: Navya, Updated On : December 2, 2021 11:07 am
Follow us on

Kadapa DCCB Jobs: దేశంలోని కోట్ల సంఖ్యలో నిరుద్యోగులు బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారు. బ్యాంక్ జాబ్స్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లకు కడప డిస్ట్రిక్ట్‌ కో ఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ శుభవార్త చెప్పింది. క్లర్క్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 75 క్లర్క్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది. గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్లు క్లర్క్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

Kadapa DCCB Jobs

ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకుకునే వాళ్లకు కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ఇంగ్లీష్ పై అవగాహన, స్థానిక భాషలో ప్రొఫిషియన్సీ ఉండాలి. ఆన్ లైన్ విధానంలో అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మొదట ఆన్ లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ఆన్ లైన్ పరీక్షలో ఎవరైతే అర్హత సాధిస్తారో వాళ్లను ఇంటర్వ్యూ ద్వారా తుది ఎంపిక చేస్తారు.

Also Read: NTRUHS Recruitment: ఎన్టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో జాబ్స్.. మంచి వేతనంతో?

100 మార్కులకు ఆన్ లైన్ టెస్ట్ జరగనుండగా ఈ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కట్ అవుతాయి. 2021 సంవత్సరం డిసెంబర్ నెల 3వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉంది. https://kadapadccb.in వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నిరుద్యోగులకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా మేలు జరగనుంది.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు మంచి వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరుతోంది.

Also Read: Jobs: ప్రముఖ సంస్థలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్.. భారీ వేతనంతో?