https://oktelugu.com/

Shilpa Case: పోలీసు స్టేషన్​కు సూపర్​స్టార్​ మహేశ్ సోదరి.. ఎందుకో తెలుసా?

Shilpa Case: ప్రస్తుతం టాలీవుడ్​లో శిల్పా చౌదరి వివాదం హాట్​ టాపిక్​గా మారింది. అధిక వడ్డీ పేరుతో.. ప్రముఖుల నుంచి కోట్లు కొల్లగొట్టిన శిల్పాను ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్​లోని ప్రముఖులైన ముగ్గురు సెలబ్రిటీలను మోసం చేసిన కేసులో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే, శిల్పా అరెస్ట్ అయినప్పటికీ ఆ ముగ్గురు సెలబ్రిటీలు ఎవరన్నది తెలియాల్సి ఉంది. Also Read: డిసెంబర్‌లో ‘ఆహా’ సందడి చేయనున్న కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 2, 2021 / 10:15 AM IST
    Follow us on

    Shilpa Case: ప్రస్తుతం టాలీవుడ్​లో శిల్పా చౌదరి వివాదం హాట్​ టాపిక్​గా మారింది. అధిక వడ్డీ పేరుతో.. ప్రముఖుల నుంచి కోట్లు కొల్లగొట్టిన శిల్పాను ఇటీవలే పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. టాలీవుడ్​లోని ప్రముఖులైన ముగ్గురు సెలబ్రిటీలను మోసం చేసిన కేసులో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అయితే, శిల్పా అరెస్ట్ అయినప్పటికీ ఆ ముగ్గురు సెలబ్రిటీలు ఎవరన్నది తెలియాల్సి ఉంది.

    super-start-mahesh-sister-priyadarshini-complains-on-shipla-chowdari

    Also Read: డిసెంబర్‌లో ‘ఆహా’ సందడి చేయనున్న కొత్త సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల వివరాలు…

    ఈ నేపథ్యంలోనే విచారణలో శిల్పా బాధితుల్లో చాలా మంది ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో సూపర్​స్టార్ మహేశ్​బాబు సోదరి, హీరో సుధీర్​ బాబు భార్య ప్రియదర్శిని కూడా ఉన్నట్లు సమాచారం. శిల్పా చౌదరి తమ వద్ద రూ.2.9 కోట్లు తీసుకుని మోసం చేసిందని ప్రియదర్శిని పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేసింది.

    శిల్ప అరెస్టు అయిన 5 రోజుల తర్వాత ప్రియదర్శిని పోలీసు స్టేషన్​కు రావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. బుధవారం ఆమె మాదాపూర్​ పోలీసు స్టేషన్​లో శిల్పాపై ఫిర్యాదు చేశారు. వీక్ కిట్టి పార్టీ అని పిలిచి, తమ వద్ద డబ్బు తీసుకుందని, డబ్బుల కోసమే ఆమె ఆ పార్టీలు ఏర్పాటు చేసేదని, తన వద్ద రూ. 2.9 కోట్లు తీసుకుని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు పోలీసులు శిల్పాను మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది. ఎక్కడెక్క డబ్బులు దాచిందో తెలుకునేందుకు ప్రయత్నించనున్నట్లు సమాచారం.

    Also Read: పూర్ణ నటించిన “బ్యాక్ డోర్” చిత్ర రిలీజ్ వాయిదా… కారణం ఏంటంటే ?